S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కర యాత్రికుల సేవలపై 4న ట్రయల్ రన్

విజయవాడ, జూలై 31: పుష్కరనగర్‌లలో యాత్రికులకు అందించే సేవలపై ఈనెల 4న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ వెల్లడించారు. ప్రత్యేకాధికారి బి.రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిసిపి క్రాంతిరాణా ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన పుష్కరనగర్ నిర్మాణాలను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పుష్కరనగర్‌లలో ఈనెల 7వ తేదీన ఇదే విధంగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధంగా వుండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ మూడు షిఫ్ట్‌లలో కేటాయించిన ఉద్యోగులు వారి వారి అవసరమైన స్టాల్స్ వంటివి పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్టాండ్‌లోను, పుష్కరనగర్‌లు ఏర్పాటుచేసి ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. యాత్రికులు వెళ్లేందుకు దారులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పుష్కరనగర్‌ల వెలుపల ప్రాంతంలోని ఇరువైపులా రిసెప్షన్ కౌంటర్లు, వైద్య శిబిరాలు, క్లోక్‌రూం సౌకర్యం, చెప్పుల స్టాండ్ వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకంగా ఆహార పదార్ధాల సరఫరాకు పుష్కరనగర్‌లో సగం భాగాన్ని కేటాయించాలని సూచించారు. అదే విధంగా ఆర్టీసీ బస్టాండ్‌లో యాత్రికుల రద్దీ అధికంగా వుండే అవకాశం వున్నందున ప్రస్తుతం వున్న రెండు పుష్కరనగర్‌లకు అదనంగా మరొక పుష్కరనగర్‌ని ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ఆహారం, తాగునీరు సరఫరాకు కేటాయించిన స్థలంతో పాటు ఉన్న మిగిలిన ప్రదేశంలో యాత్రికులకు వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాంగణంలో యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 150 మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. వీటికి నిరంతర నీటి సరఫరా ఏర్పాట్లకు ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న బోరు నుంచి నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ పుష్కర నగర్‌ల కోసం ఏర్పాటుచేసిన రెండు నిర్మాణాలు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ ప్రాంతంలో ఆహారం సరఫరా, ఇతర సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అన్ని శాఖలకు అవసరమైన వసతి కల్పించేందుకు వీలుగా 10 ఇనుటు 10 సైజులో పుష్కరనగర్ వెలుపల స్టాళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి నాగమల్లేశ్వరి మాట్లాడుతూ వైద్య శిబిరంలో డాక్టర్, పారామెడికల్ సిబ్బందితో పాటు రోగులకు రెండు బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు. అవసరాన్ని బట్టి 10 బెడ్ల వరకు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఫోల్‌డింగ్ కాట్‌లను సిద్ధంగా వుంచుతున్నట్లు ఆమె తెలిపారు.
దుర్గాఘాట్ సందర్శన
అంతకుముందు కలెక్టర్ దుర్గాఘాట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. 4వ తేదీన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ప్రారంభించేందుకు అన్ని విధాలా మోడల్ గెస్ట్‌హౌస్‌ను తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. సీలింగ్ పనులు, స్పీకర్‌ల ఏర్పాటు, వైరింగ్ పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 15 వర్క్‌స్టేషన్లు నిర్మించాలని కలెక్టర్ సూచించారు. దుర్గాఘాట్‌లో పాసింజర్ అండ్ పాస్ (అండర్ బ్రిడ్జి) నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ సోమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఘాట్ పరిసరాల్లో ల్యాండ్ స్కేపింగ్ చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దుర్గాఘాట్ వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్ దిగువ రోడ్డు నిర్మాణంలో చేపట్టాల్సిన పనులు సకాలంలో జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.