S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాగని రోడ్ మ్యాప్!

హైదరాబాద్, జూలై 31: కొత్త జిల్లాలపై ప్రభుత్వం ప్రకటించిన రోడ్ మ్యాప్ ప్రకారం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కలెక్టర్ నుంచి ఎమ్మార్వో వరకు రెవిన్యూ శాఖ మొత్తం హరితహారంలో తలమునకలు కావడంతో కొత్త జిల్లాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. రెండు వారాలపాటు మాత్రమే కొనసాగాల్సిన హరితహారాన్ని జూలై నెలాఖరు వరకూ పొడిగించడంతో కొత్త జిల్లాల ముసాయిదా ఖరారుపై అధికారులు దృష్టి సారించలేకపోయారు. ఆగస్టు మొదటివారంలోనూ ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం. ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఉండటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని రెవిన్యూ ఉన్నతాధికారులంతా అందులో లీనమయ్యారు. కనీసం ఆగస్టు రెండోవారం నుంచైనా దృష్టి కేంద్రీకరించే అవకాశాలు తక్కువే ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12నుంచి ప్రారంభమై 24 వరకు కొనసాగుతాయి. కొత్త జిల్లాలపై ప్రభుత్వం ప్రకటించిన రోడ్ మ్యాప్ ప్రకారం జూలై 10లోగా అఖిలపక్ష సమావేశం జరగాల్సి ఉంది. సమావేశం తర్వాత వారి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 4నుంచి 10 లోగా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ముసాయిదా విడుదల చేసిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు 30నుంచి 45 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ కూడా కొత్త జిల్లాల సంఖ్య 13? 14? అనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత రాలేదు. అలాగే దీనిపై జరగాల్సిన అఖిలపక్ష సమావేశాన్నీ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహించలేకపోయింది. కొత్త జిల్లాల సంఖ్య ఎంత అనే దానిపై ప్రభుత్వానికి ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం వల్లే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేకపోయినట్టు అధికార వర్గాల సమాచారం. రోడ్ మ్యాప్ ప్రకారం ముసాయిదా విడుదలకు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకొని విడుదల చేయనున్నట్టు సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే రోడ్ మ్యాప్ ప్రకారం ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ముసాయిదా ప్రకటించిన తర్వాతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు అదనంగా 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టు సిఎం కెసిఆర్ సూచనప్రాయంగా ఇప్పటికే వెల్లడించారు. దీంతో అధికారులు ముందు ఖరారు చేసిన ముసాయిదాలో చేర్పులు, మార్పులు చోటు చేసుకోవడంతో నోటిఫికేషన్ జారీలో జాప్యం జరగడానికి కారణంగా అధికారులు అంటున్నారు. అధికారులు మొదట ప్రతిపాదించిన జిల్లాలు కాకుండా సిఎం సూచనతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లనూ కొత్త జిల్లాగా చేర్చారు. ఆ తర్వాత సిరిసిల్లను కూడా ప్రతిపాదనలో చేర్చి భూపరిపాలనశాఖ కమిషనర్‌కు నివేదిక అందింది. అంతటితో ఆగిపోకుండా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌నూ జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై వత్తిడి వచ్చింది. దీంతో నిర్మల్‌నూ చేర్చడంతో జిల్లాల సంఖ్య 14 కాకుండా 15కు చేరుకుంది. దీంతో కొత్త జిల్లాల సంఖ్య 13? 14? 15? అనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేకుండా పోయింది. ఒకవైపు కొత్త జిల్లాల సంఖ్య ఖరారు కాకపోవడం, అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవడం, తుది ముసాయిదా విడుదలలో జాప్యం, ప్రధాన రాష్ట్ర పర్యటనా, కృష్ణా పుష్కరాల నిర్వహణ వల్ల రోడ్ మ్యాప్ నిర్దేశించిన ప్రకారం ముందుకు సాగకపోవడానికి కారణమని అధికారులు విశే్లషిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సెంటిమెంట్‌గా దసరా పండుగ నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కావాలని సిఎం కెసిఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇంతవరకు జరిగిన జాప్యంవల్ల మందగించిన రోడ్ మ్యాప్‌ను వేగవంతం చేయడానికి సిఎం కెసిఆర్ మూడు నాలుగు రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ సమావేశం తర్వాతనే కొత్త జిల్లాల ప్రక్రియ పట్టాలు ఎక్కనుందని అధికార వర్గాల సమాచారం.