S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సెంటి‘మంట’ ఉందా?

హైదరాబాద్, జూలై 31: నిజంగా జనంలో హోదా సెంటిమెంట్ ఉందా? లేక దాన్ని రేపుతున్నారా? అదీగాకపోతే దాన్ని అడ్డుపెట్టుకుని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయా? ఇప్పుడు నవ్యాంధ్రలోని అన్ని వర్గాల్లోనూ జరుగుతున్న చర్చ ఇది. ప్రత్యేక హోదా అన్నది సెంటిమెంటుగా మారుతోందని తెదేపా నుంచి కాంగ్రెస్ వరకూ అన్ని పార్టీలూ తరచూ ప్రస్తావించడం వెనుక రాజకీయ ఎత్తుగడే తప్ప, జనంలో అసలు ఆ సెంటిమెంట్ ఉందా అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. హోదా అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎత్తుపై ఎత్తులకు వేదిక అవుతోందన్న భావన అన్ని వర్గాల్లోనూ నెలకొంది. దానికి ఉదాహరణగా చూపిస్తున్న అంశాలు కూడా ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి.
సమైక్యాంధ్రలో తెలంగాణ సెంటిమెంటు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం కనీస స్థాయిలో కనిపించలేదు. తెలంగాణలో ఉన్న సెంటిమెంట్ భావనలో, సీమాంధ్రలో సగం కూడా ఉండేదికాదని రాజకీయ విశే్లషకులు గుర్తు చేస్తున్నారు. చివరకు తెలంగాణలో ఉద్యమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్న విమర్శలకు జంకిన మీడియా సంస్థలు, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా పతాకస్థాయికి తీసుకువెళ్లి సమన్యాయం చేశాయి.
రాష్ట్రం విడిపోకముందే సీమాంధ్ర ప్రజలు విభజనపై మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు విభజననే సెంటిమెంటుగా భావించని ఏపి ప్రజలు, ఇప్పుడు హోదా రాకపోవడాన్ని సెంటిమెంటుగా భావిస్తారా? అన్న చర్చ ముందుకొచ్చింది.
నిజానికి అసలు హోదా వల్ల ఎలాంటి లాభాలొస్తాయన్న దానిపై 95 శాతం మందికి అవగాహన లేదు. గత రెండేళ్ల నుంచి హోదా గురించి తరచూ చర్చ జరుగుతున్నందున, అదివస్తే రాష్ట్రానికి లాభమన్న విషయం ఒక్కటే ప్రజలు గమనంలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, బాబు పలుసార్లు హోదాపై చేసిన వ్యాఖ్యల వల్ల హోదా వచ్చినా లాభం లేదని కూడా ప్రజలు గ్రహించారు. పదిహేనేళ్లు హోదా కావాలని ఎన్నికల సమయంలో కోరిన బాబు, ఆ తరువాత అనేకసార్లు హోదా వల్ల ఉపయోగం లేదని చెప్పారు. హోదా సంజీవని కాదన్నారు. అది సోషల్ మీడియాలో బాగా ప్రచారమయింది. అధికారంలో ఉన్నప్పుడు హోదాకు చట్టబద్ధత కల్పించని కాంగ్రెస్ ఇప్పుడు పోరాటం చేస్తోందని, హోదా ఇస్తామన్న మోదీ మాట తప్పారని, విభజనకు లేఖ ఇచ్చిన తెదేపా ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతోందన్న అభిప్రాయం తప్ప, హోదా ఇవ్వకపోతే రోడ్లపైకొచ్చి ఉద్యమం చేయాలన్న భావన ఏపి ప్రజల్లో కనిపించడం లేదని పరిశీలకులు విశే్లషిస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ హోదాను తెరమీదకు తీసుకురావడంతో అన్ని పార్టీలో ఆ జపం అందుకున్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, వైకాపా ఎక్కడా బలపడకూడదన్న వ్యూహంతో ఆ రెండు పార్టీలతో పాటు, తనకు సహాయ నిరాకరణ చేస్తున్న బిజెపిని కూడా కలిపి చిత్తుచేసే ఎత్తుకు బాబు తెరలేపారని రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు.
హోదా అంశాన్ని అడ్డుపెట్టుకుని బిజెపిని బెదిరించే రాజకీయ ఎత్తుగడకు బాబు శ్రీకారం చుడితే, బాబు మొహమాటం వల్లే హోదా రావడం లేదని, ఓటుకు నోటు కేసుతోపాటు లక్ష కోట్ల కుంభకోణంపై మోదీ ఎక్కడ సీబీఐ విచారణకు ఆదేశిస్తారన్న భయంతో, కేంద్రం నుంచి బయటకు రావడం లేదని జగన్, రఘువీరారెడ్డి ఆరోపణలు పదునెక్కిస్తున్నారు.
ప్రజలు వీటికంటే కీలకమైన రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, తాగు- సాగునీరు సమస్యలకే ప్రా ధాన్యం ఇస్తున్నారంటున్నారు.