S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంసెట్-2 రద్దుపై నేడు ప్రకటన

హైదరాబాద్, జూలై 31 : తెలంగాణ ఎంసెట్-2 (మెడికల్) పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమైంది. ఎమ్సెట్ రద్దు అంటూ కేవలం ఒక ప్రకటన ఇవ్వడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, రుజువులతో సహా ప్రకటించాల్సి ఉంది. అందుకే సిఐడి నివేదికను ప్రభుత్వం ఉపయోగించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. సిఐడి నివేదిక న్యాయస్థానం ముందు నిలుస్తుందా అన్నది ఒక ప్రశ్నగా మారింది. ఈ కారణంగానే అన్ని సాక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. సిఐడి నివేదికను ఫకడ్బందీగా రూపొందిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఎమ్మెట్ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లినా ప్రభుత్వం తన వాదనను నిరూపించుకునేందుకు సమాయత్తం అయింది.
కాగా ఎంసెట్-3 కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతూనే ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ప్రశ్నాపత్రాల రూపకల్పన రహస్యంగా రూపొందించడం, ప్రింటింగ్‌ను కూడా రహస్యంగానే ఉంచడం, కీలక వ్యక్తులకు తప్ప కిందిస్థాయి ఉద్యోగులకు ఈ వివరాలు తెలియకుండా చూడాలని నిర్ణయించారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితర బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళిక రూపొందించారు. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే చకచకా పనులు సాగేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.