S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొవ్వాడపై 15లోగా ముసాయిదా సిద్ధం

హైదరాబాద్, జూలై 31: కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల తలెత్తే సామాజిక పరిస్థితులపై చేపట్టిన సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం పూర్తయింది. 6600 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ప్రధాన ఘట్టం పూర్తయినట్లే. సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం పూర్తయినందున ఆగస్టు 15వ తేదీ నాటికి ముసాయిదా నివేదిక సిద్ధమవుతుంది. ఈ నివేదికను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే సామాజిక శాస్తవ్రేత్తలు, జిల్లా అధికారులు, గ్రామాల ప్రతినిధులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ నివేదికను సమీక్షించి తన అభిప్రాయాన్ని ఆగస్టు నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌కు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ వెయ్యి మెగావాట్ల కెపాసిటీ ఉన్న ఆరు అణు రియాక్టర్లను సరఫరా చేయనుంది. కాగా కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కోసం భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. మొత్తం 2074.51 ఎకరాలు ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమని న్యూక్లియర్ విద్యుత్ కార్పొరేషన్ గుర్తించింది. ఇందులో ప్రైవేట్ భూమి 599.20 ఎకరాలు, ప్రభుత్వ భూమి 791.377 ఎకరాలు, అసైన్డ్ భూములు 683.94 ఎకరాలు ఉన్నాయి. సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం నివేదికను హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ చేపట్టింది.

కోస్తాకు వర్ష సూచన

విశాఖపట్నం, జూలై 31: ఈశాన్య బంగాళాఖాతంలో నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు భూ ఉపరితలానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో పశ్చిమ దిశగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి.

ఘాట్లలో విద్యుద్ధీకరణ
వచ్చే వారానికి పూర్తి

హైదరాబాద్, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వచ్చే వారానికి కృష్ణా నది తీరంలో 159 ఘాట్లలో విద్యుద్ధీకరణ, విద్యుత్ వౌలిక సదుపాయాల పనులు పూర్తవుతాయని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. దీని కోసం డిస్కాంల నుంచి రూ. 85 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ అర్బన్ శాఖలు ప్రతిఘాట్ వద్ద విద్యుత్ స్తంభాల ఏర్పాటును తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో విద్యుత్ రంగంపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. 110 మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి వీధి దీపాల కార్యక్రమం పూర్తవుతోందన్నారు. ఎల్‌ఇడి వీధి దీపాల వ్యవస్థపై ఆగస్టు 3వ తేదీన విజయవాడ, గుంటూరు నగరాల్లో తనిఖీలు చేయనున్నట్టు అజయ్ జైన్ తెలిపారు.