S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్ష మంది పుణ్యస్నానాలు

రాజమహేంద్రవరం, జూలై 31: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉదయం ఆరు గంటలకు రాజమహేంద్రవరం సరస్వతి విఐపి ఘాట్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర ప్రజా ప్రతినిధులు పుణ్య స్నానాలు ఆచరించి, అంత్య పుష్కర క్రతువును లాంఛనంగా ఆరంభించారు. ప.గో. జిల్లా కొవ్వూరులో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు. జిల్లాలోని ప్రసిద్ధ గోష్పాద క్షేత్రంలో మాణిక్యాలరావు దంపతులు ఆదివారం ఉదయం పుష్కర స్నానం ఆచరించి, గోదావరి నదికి హారతులిచ్చారు. గోదావరి నదికి మాత్రమే ప్రత్యేకమైన అంత్య పుష్కరాల తొలి రోజు పుణ్యస్నానాలకు భక్తులు భారీగానే తరలివచ్చారు. అయితే ఆది పుష్కరాల తరహాలో ఒకేసారికాక, భక్తుల రాక కొద్దికొద్దిగా పెరిగింది. ఉదయం 9 గంటల తర్వాత చెప్పుకోదగ్గ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య పలచబడగా, సాయంత్రం మళ్లీ కొంత రద్దీ పెరిగింది. మొత్తం మీద తొలి రోజు తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని ఘాట్లలో కలిసి సుమారు లక్ష మంది పుణ్యస్నానాలు ఆచరించివుంటారని అంచనా. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 47వేల మంది పుణ్యస్నానాలు చేసివుంటారని అంచనావేస్తున్నారు. కోటిలింగాల, పుష్కర ఘాట్‌లలో ఏర్పాటు చేసిన జల్లు స్నానాల్లో అత్యధికంగా యువకులు స్నానాలు ఆచరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, పట్టిసం, నరసాపురం, కోడేరు తదితర 40 స్నాన ఘట్టాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే తొలిరోజు ఒడిస్సా యాత్రికుల జాడ కనిపించలేదు. పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో అంత్య పుష్కరాలు ఆరంభం కావడంతో ప్రసిద్ధమైన రోజుగా భక్తజనం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడం, మంగళవారం పిండప్రదానాలకు అనుకూలమైన రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
కాగా గోదావరి నది పుష్కర ఘాట్లలో అవసరమైన మేరకు వీలుగా గోదావరి నీటి మట్టం వుండే విధంగా ధవళేశ్వరం బ్యారేజి వద్ద గేట్లను మూసివేసి 13.9 అడుగుల ప్రవాహ నీటి మట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పనె్నండు రోజుల పాటు వరద ఉద్ధృతిని, భక్త జనం రద్దీని నిత్యం పర్యవేక్షిస్తూ క్రమబద్ధీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరంలో కోస్తా రీజియన్ ఐజి కుమార విశ్వజిత్, అర్బన్ ఎస్పీ ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. మొదటి రోజు రద్దీని బట్టి సిబ్బందిని క్రమబద్ధీకరించడం, ఆంక్షలను ఉపసంహరించడం జరుగుతుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సిసి కెమెరాల నిఘాతో నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఎక్కడ ఎటువంటి సేవలు అందించాలన్నా, రద్దీ నియంత్రణకు నగరపాలక సంస్థ కమిషనర్, అంత్య పుష్కర నోడల్ అధికారి విజయ రామరాజు ప్రత్యేక పర్యవేక్షణలో అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి.
ఒడిస్సా యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఒడిస్సా రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ప్రబలి వుందని సమాచారం వుండటంతో ఇక్కడ వైద్య సేవలు పెద్ద ఎత్తున ఏర్పాటుచేశారు. ఒరిస్సా బస్సుల్లో స్ప్రేయింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అక్కడి నుంచి వచ్చిన యాత్రికుల్లో ఎవరికైనా జ్వరం వస్తే స్నాన ఘట్టాలవద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
భద్రాచలంలో అంత్యపుష్కరాలను ప్రారంభిస్తున్న పిఓ ఇతర అధికారులు... తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు