S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రుణ రికవరీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రుణ రికవరీ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు అమల్లోకి వస్తే రుణాల వసూళ్లు తేలిక కానుందని నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యా రుణాల విషయంలో వెసులుబాటు ఉంటుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విద్యార్థి నిరుద్యోగి అయితే అతనికి ఉద్యోగం వచ్చేదాకా కొంత సంయమనం పాటిస్తామని, రుణం మాత్రం ఎప్పటికీ రద్దు కాదని స్పష్టం చేశారు. అలాగే రైతులకు కొంత మినహాయింపునిచ్చారు.