తగ్గిన వేదాంత రిసోర్సెస్ లాభం
Published Tuesday, 2 August 2016లండన్, ఆగస్టు 1: పన్నులు, వడ్డీ మదింపులకు ముందు లాభం ఈ జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో దాదాపు 3,439 కోట్ల రూపాయలు (527.1 మిలియన్ డాలర్లు)గా నమోదైనట్లు వేదాంత రిసోర్సెస్ సోమవారం తెలిపింది. నిరుడుతో పోల్చితే ఇది 18 శాతం తక్కువని, పోయినసారి 644.6 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పింది. ఆదాయం తగ్గడమే లాభాల్లో క్షీణతకు కారణమని పేర్కొంది. ఈ ఏప్రిల్-జూన్లో ఆదాయం 2.34 బిలియన్ డాలర్లుగా ఉందని, గత ఏప్రిల్-జూన్లో ఇది 2.95 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గుర్తుచేసింది.