S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బయటపడితేనే బలపడతాం!

హైదరాబాద్, ఆగస్టు 1: బిజెపికి విడాకులు ఇవ్వాలంటూ గళమెత్తుతున్న తెదేపా నేతల తీరుపై ఆ పార్టీలో చర్చ మొదలయింది. తాము కూడా అదే కోరుకుంటున్నామని, అది ఎంత త్వరగా జరిగితే పార్టీకి అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెదేపాతో విడిపోవాలని మెజారిటీ నేతలు కోరుకుంటుండగా, మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాత్రం కలసి ఉండాలని కోరుకోవడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.
తెదేపాతో కలసి ఉంటామని, పొత్తు కొనసాగుతోందని, కాంగ్రెస్-వైకాపా తమ మధ్య దూరం పెంచే కుట్ర చేస్తున్నాయని ఇద్దరు మంత్రులు వ్యాఖ్యానించడాన్ని తప్పుపడుతున్నారు. సుజనాచౌదరి కేంద్రమంత్రిగా ఉంటూనే బిజెపిని విమర్శిస్తుంటే, తమ మంత్రులు మాత్రం తెదేపాపై ఎదురుదాడి చేయడంలో మొహమాటం ప్రదర్శించడాన్ని సహించలేకపోతున్నారు. బాబు సహా ఎంపీలు తమ పార్టీపై చేస్తున్న విమర్శలకు తగిన జవాబు చెప్పకుండా, కలసి ఉండాలని ప్రకటించడం బట్టి వారు మానసికంగా ఎటు వైపు మొగ్గుచూపుతున్నారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. బిజెపికి విడాకులిచ్చేయాలంటూ జెసి దివాకర్‌రెడ్డి, బుద్దావెంకన్న, తమ పార్టీ నేతలను అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవాలని బుచ్చయ్యచౌదరి తదితరులు రెండురోజుల నుంచి చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర బిజెపి నేతల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వారందరితో మాట్లాడిస్తున్నారని గ్రహించిన బిజెపి నేతలు, తెదేపా సర్కారు నుంచి తమ మంత్రులు బయటకు వస్తేనే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. నిజానికి క్యాబినెట్‌లో ఉన్నందున తమ పార్టీకి, కార్యకర్తలకు రాజకీయంగా ప్రయోజనమేమీ జరగలేదంటున్నారు. విజయవాడ గుళ్ల కూల్చివేత విషయాన్ని తమ పార్టీకి చెందిన మంత్రి మాణిక్యాలరావుకు చెప్పలేదని, వైద్యశాఖలో కూడా నేరుగా సీఎంఓనే నిర్ణయాలు తీసుకుంటోందని గుర్తు చేస్తున్నారు.
తెదేపా నీడ నుంచి బయటకొస్తే తప్ప, రాష్ట్రంలో పార్టీకి మనుగడ లేదన్న అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ చంద్రబాబునాయుడే తమ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, అందుకే సభ్యత్వాలు ముగిసి, అన్ని రాష్ట్రాలకూ అధ్యక్షులను నియమించినా, ఏపిలో మాత్రం నియమించలేదని బిజెపి సీనియర్లు తమ అంతర్గత సంభాషణల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
తెదేపా ఎంపిలు కోరుకున్నట్లు బయటకువెళితే, తమ పార్టీ బలపడుతుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తెదేపాతో కలసి ఉంటే తమకు ఇప్పుడున్న సీట్లు కూడా రావంటున్నారు. నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘనత తమదే అయినా, తమ రాష్ట్ర అధ్యక్షుడు సహా మంత్రులు, ఎంపిలెవరూ ఆ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోవడంవల్లే ఆ ఖ్యాతి బాబు ఖాతాలోకి వెళ్లిందని గుర్తు చేస్తున్నారు.
కన్నా, పురంధ్రీశ్వరి, కావూరి వంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన అగ్రనేతలతోపాటు సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, సురేష్‌రెడ్డి వంటి గొంతున్న నేతలు జనంలోకి వెళితే, పార్టీ బలం పెరుగుతుందని విశే్లషిస్తున్నారు. తాము మొదటి నుంచీ బలంగా లేనందున, పెద్దగా నష్టపోయేదేమీ లేదని, అదే జీరో స్థాయి నుంచి మొదలుపెడితే బలపడతామంటున్నారు. వీళ్లకు పొత్తుల గురించి మాట్లాడే స్థాయి లేదు. వాళ్ల గురించి మా పార్టీ స్థాయి తగ్గించుకోం. పొత్తుల ఆలోచన సమయంలో వీళ్లెవరూ లేరు. పొత్తులనేవి లాభనష్టాలపై ఆధారపడి జరిగేవి. బాబుగారు మేము 15 సీట్లు నష్టపోయామంటున్నారు. మేము కూడా నష్టపోయాము. కానీయండి. మాకు కూడా రాష్ట్రంలో మాట్లాడేందుకు చాలా సమస్యలు, అంశాలున్నాయి. అసెంబ్లీ అప్పుడు అవన్నీ మాట్లాడతామ ని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ వ్యాఖ్యానించారు.