S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీట్‌కు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, ఆగస్టు 1:దేశ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి ఒకే పరీక్షా విధానం నీట్ అమలులోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన రెండు కీలక బిల్లులను పార్లమెంట్ సోమవారం ఆమోదించింది.పారదర్శకత, ఎక్కువ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా చేయడం..కౌనె్సలింగ్ పేరిట విద్యార్ధులను దోచుగోవడాన్ని అరికట్టే ఉద్దేశంతోనే నీట్‌ను ప్రవేశ పెడుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం కింద ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు కూడా నీట్ ప్రాతిపదికనే జరుగుతాయని ఆరోగ్య మంత్రి జెపి నడ్డా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రయోజనం కలుగుతుందన్న వాదనను తిరస్కరించారు. ఇప్పటికే భారత వైద్య మండలి (సవరణ)బిల్లు, డెంటిస్టుల (సవరణ) బిల్లులను లోక్‌సభ ఇప్పటికే ఆమోదించింది. వీటికి రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.