S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బలపడిన అల్పపీడనం

హైదరాబాద్, ఆగస్టు 1: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉపరితలద్రోణితో కలవడంతో పాటు, వచ్చే రెండురోజుల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన అల్పపీడనంగా మారుతుండంతో కోస్తా, తెలంగాణల్లో వచ్చే రెండు, మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భలలో భారీనుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కరీంనగర్‌జిల్లా మెట్‌పల్లిలో 22 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్‌లో 16 సెంటీమీటర్లు, కమ్మర్‌పల్లి, బాల్కొండలో 14, శ్రీరాంసాగర్‌లో 12, వేల్పూర్‌లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలోని విశాఖపట్నంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంతో సహా కోస్తాలోని ఇతర జిల్లాలు, రాయలసీమలో ఒక మోస్తరు నుండి భారీగా వర్షం కురిసింది.