S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాపాలను ఎండగడతాం

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాపాలు పెరిగిపోయాయని, ఆయన పాపాలను వదిలిపెట్టేది లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ హెచ్చరించారు. తెలంగాణ కేవలం కెసిఆర్ కుటుంబానికి మాత్రమే వచ్చినట్టుగా అనిపిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కెసిఆర్ చేస్తున్న పాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటిని ఎండగడుతామని ద్వజమెత్తారు. సోమవారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం మహాపాదయాత్ర మహబూబ్‌నగర్‌కు చేరుకోగా, ఈ సందర్భంగా జలసాధన పేరిట మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, కాంగ్రెస్ సినియర్ నేత జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, బిజెపి జాతీయనేత నాగం జనార్థన్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలువురు రాష్ట్ర నేతలు, తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల ఫోరం నాయకులు హజరయ్యారు. ధర్నాలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ 69 జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమలు చేసి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ ప్రజలు కోరుకుంటున్న ప్రాజెక్టులు కట్టడంలేదని, తమకు ప్రాజెక్టులు అవసరం లేదని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రోడ్డెక్కుతుంటే, అక్కడ మాత్రం బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కొని ప్రాజెక్టుల నిర్మిస్తున్నారని మండిపడ్డారు. నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టు కోసం మూడు నియోజకవర్గాల ప్రజలు గత 10 రోజులుగా పాదయాత్రలు చేస్తూ ప్రాజెక్టు నిర్మించాలని కోరుతుంటే, ఇక్కడ మాత్రం దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి సిఎంకి తెలంగాణ ప్రజాకోర్టులో శిక్ష తప్పదని, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సిఎం కావడం దురదృష్టకరమని, ఆయనకు ప్రజల ఉసురు తప్పక తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నయా రజాకార్ల ఆగడాలు మితిమిరిపోయాయని, రైతులు ఇక తిరగబడి అంతమొదించాలని పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ కేవలం కెసిఆర్ కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజా తెలంగాణ కాదన్నట్టు పాలన సాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిద్రమత్తు వీడాలని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిపై దృష్టి సారించాలని సూచించారు. నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి కేవలం 10శాతం నిధులు మాత్రమే అవసరం ఉంటుందని, మిగతా 90శాతం నిధులు కేంద్రం భరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు వరద జలాలు కాదనే విషయాన్ని సిఎం గుర్తించుకోవాలని, నికర జలాలు కేటాయిస్తూ జీవో 69ని గత రెండేళ్ల క్రితమే ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. నారాయణపేట -కొడంగల్ ప్రాజెక్టు కోసం అసెంబ్లీ లోపల బయట పోరాటం చేస్తామని, ప్రాజెక్టు సాధించేవరకు రైతులు కూడా తమ ఉద్యమాన్ని విడవకూడదని పిలుపునిచ్చారు. ధర్నాలో జలసాధన సమితి కన్వీనర్ అనంతరెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాద్యక్షులు నాగురావు నామాజీ, న్యూడెమోక్రసి నాయకురాలు రమ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. జలసాధన మహధర్నాలో ప్రసంగిస్తున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు రమణ