S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హారంపై ఆరా

హైదరాబాద్, ఆగస్టు 1: హరితహారం నిర్వహణను కొందరు ఉదాశీనంగా తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు బాగానే పని చేస్తున్నా, కొందరి నిర్లక్ష్యం వల్ల కార్యక్రమంలో వెలితి కనిపిస్తోందన్నారు. జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే కార్యక్రమంలో బాగా పాల్గొన్నారో, ఎవరు పాల్గొనలేదో మంత్రులకు ఫోన్ ద్వారా సిఎం వివరాలు అందించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం హరితహారంపై సిఎం సమీక్ష నిర్వహించారు. అధికారులు సమర్పించిన నివేదికలతోపాటు వివిధ మార్గాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సమావేశం నుంచే మంత్రులతో సిఎం మాట్లాడారు. అధికారుల పనితీరుకు, ప్రజాప్రతినిధులకు అవకాశాలు కల్పించడానికి హరితహారంలో వారి భాగస్వామ్యమే కొలమానం అవుతుందని సిఎం స్పష్టం చేశారు. హరితహారంలో బాగా పనిచేసిన వారికి ఆగస్టు 15న జరిగే వేడుకల్లో హరితమిత్ర అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. ప్రజల్లో మొక్కలు నాటాలనే ఉత్సాహం బాగా పెరిగిందని, మంచి వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి అనుకూల పరిస్థితి ఉందన్నారు. హరితహారాన్ని విజయవంతం చేయడానికి అందరూ కలిసి పని చేయాలని మంత్రులకు సూచించారు. భూభాగంపై 33 శాతం అడవులుంటేనే వాతావరణ సమతుల్యం ఉంటుందని, మొక్కల పెంపకాన్ని కూడా శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా చూడాలి తప్ప వేరే కార్యక్రమంగా భావించరాదన్నారు. మొక్కలు నాటడంతోనే సరిపోదని, వాటిని రక్షించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వచ్చే జూన్ వరకు ప్రస్తుతం నాటిన మొక్కలను రక్షించగలిగితే అవి బతికినట్టేనని అన్నారు. వర్షాకాలంలో వాటికి పెద్దగా నీటి అవసరం లేకున్నా ఎండాకాలంలో అవసరం ఉంటుందన్నారు. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లను వాడుకోవాలని, ప్రభుత్వ శాఖలన్నింటినీ భాగస్వామ్యం చేయాలని సిఎం సూచించారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామాల వారీగా మొక్కలు నాటడం, వాటిని రక్షించడానికి కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. ప్రతీ డివిజన్‌కు ఒక అటవీశాఖ సీనియర్ అధికారిని ఇంచార్జిగా నియమించి హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి ప్రతీ రోజు హరితహారంపై వివరాలను సిఎం కార్యాలయం సమీక్షించాలని సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. అధికారుల పనితీరుకు, ప్రజాప్రతినిధులకు అవకాశాలు కల్పించడానికి హరితహారంలో వారి భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.