S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లారీ బీభత్సం

హైదరాబాద్, ఆగస్టు 1: హైదరాబాద్‌లో ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం మియాపూర్ వద్ద జాతీయ రహదారిపై సంఘటన చోటుచేసుకుంది. భారీ లోడ్‌తో లారీ జనంపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కూకట్‌పల్లి నుంచి బిహెచ్‌ఇఎల్ వైపు వెళ్తున్న లారీ మదీనగూడ వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమల్లి ప్రాంతానికి చెందిన ఆదినారాయణ (38) శ్రీనివాస్ (32) అక్కడిక్కడే మృతి చెందారు. కృష్ణమూర్తి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కృష్ణమూర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ రమేశ్ తెలిపారు.