S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మతం మహిళల ఎదుగుదలకు అడ్డు

హైదరాబాద్, ఆగస్టు 1: మహిళలు చైతన్యవంతులైతే సమాజం ప్రగతి పథంలో నడుస్తుందని అయితే మతం మహిళల ఎదుగుదలకు ఆటంకం అవుతుందని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ‘నాయకత్వ కార్యశాల’ రెండోరోజు కార్యక్రమంలో ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పాల్గొన్నారు. మహిళలు నాయకత్వంలోకి రావాలంటే ఇంట్లో కూడా పోరాటం చేయాలని అన్నారు. అన్ని మతాల్లో స్ర్తిలను తక్కువ చేసి చూపుతున్నారని, సమాజంలో అనిశ్చితి ఏర్పడటానికి మతం ప్రధాన కారణం అవుతోందని అన్నారు. మహిళలను ఇంటికే పరిమితం చేయడంలో మతం ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు. టిఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో మహిళా టీచర్ల పాత్ర కీలకమైనదని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల వేదిక ఆవిర్భవించింది. ఈవేదిక కన్వీనర్‌గా సిహెచ్ దుర్గ్భావాని, కో కన్వీనర్లుగా ఎస్ సరళ, రాజకుమారి, సభ్యులుగా మంజుల, ఆర్ శారద ఎన్నికయ్యారు.