S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హోదా రాదు: జెసి

అనంతపురం, ఆగస్టు 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే యోచన కేంద్రానికి లేదన్నారు. ఎన్ని బంద్‌లు, ఆందోళనలు చేసినా నిష్ప్రయోజనమేనన్నారు. హోదా రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయేది అనంతపురం జిల్లానేనని అన్నారు. ఆందోళనలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు, నష్టం తప్ప అని అన్నారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూద్దామన్నారు. ఈలోపు పుణ్యకాలం (మూడేళ్లు) గడచి పోతుంది కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అసలు ఎక్కడుంది పుణ్యకాలం.. అంతా అయిపోయిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాల్సి ఉందన్నారు. హోదా రాదన్నపుడు కేంద్రమంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగడమెందుకు అని ప్రశ్నించారు.