S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇళ్ల స్థలాలిస్తారా.. దూకి చావమంటారా?

తిరుపతి, ఆగస్టు 1: వికలాంగులకు ఇళ్లస్థలాలు కేటాయింపునకు సంబంధించి అన్ని స్థాయుల్లో అనుమతులు లభించినా కలెక్టర్ కార్యాలయంలో జాప్యం జరుగుతుండటంతో నిరసించిన వికలాంగుల సంఘం జిల్లా నాయకుడు మాధవయ్య తిరుపతిలోని తాతయ్య గంగమ్మ గుడి సమీపంలో సెల్ టవర్ ఎక్కి ఇళ్లస్థలాలు ఇస్తారా.. దూకి చావమంటారా అంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు హడావుడి పడాల్సిన పరిస్థితి సోమవారం తలెత్తింది. చిత్తూరు జిల్లా వికలాంగుల విభిన్న ఫోరం కార్యదర్శి మాధవయ్య జిల్లాలోని వికలాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ గత 2 సంవత్సరాలుగా వివిధ రకాలుగా ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో ఆమరణ దీక్షకు కూడా పూనుకున్నారు. దీంతో న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. అయితే ఇళ్లస్థలాలురాలేదు. దీంతో మనస్థాపానికి గురైన మాధవయ్య సోమవారం ఉదయం 3 గంటలకు సెల్ టవర్ ఎక్కాడు. ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు, మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హడావుడి మొదలైంది. అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు తాను దిగనంటూ భీష్మించుకున్నారు. ఈక్రమంలో రెవెన్యూ అధికారుల తరపున ఆర్ ఐ ప్రేమకుమార్ అక్కడికి చేరుకొని మాధవయ్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నంచేశారు. అయితే ఎంతకూ మాధవయ్య తన పంతం వదులకపోవడంతో చివరకు సిపి ఎం, వికలాంగ సంఘం నాయకులను రప్పించి మాట్లాడారు. అయినా ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యేను రప్పించి ఆమె చేత హామీ ఇప్పించారు. దీంతో మాధవయ్య కిందకు దిగాడు. సి ఐ రామకిశోర్ తన సిబ్బందితో ఉదయం నుంచి అక్కడే ఉంటూ మాధవయ్య ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా మాధవయ్యతో పరిచయమున్న వ్యక్తులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా వికలాంగులకు ఇంటి పట్టాలుకోసం పోరాడుతున్నా కొంత మందికి ఇచ్చి కొంతమందికి నిలిపివేశారని, దీంతో విసిగిన ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నామన్నారు.