S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేములఘాట్ బాధితులకు కాంగ్రెస్ నేతల పరామర్శ

తొగుట, ఆగస్టు 1: మల్లన్నసాగర్ భూనిర్వాసిత గ్రామం వేములఘాట్‌లో లాఠీచార్జీ బాధితులను పరామర్శించేందుకు హైకోర్టు అనుమతితో మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునితారెడ్డి ఆధ్వర్యంలో నాయకుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా లాఠీచార్జీలో గాయపడ్డ నర్సింహరెడ్డి ఇంట్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బెల్లయ్యనాయక్, భాస్కర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డిలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా గొడవ జరిగిన తీరు, పోలీసుల ప్రవర్తన, లాఠీచార్జీకి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఈసందర్భంగా తమకు ప్రాజెక్టు వద్దని, గ్రామమే కావాలని, మహిళలని చూడకుండా కొట్టరానిచోట కొట్టించి ఇప్పుడు కొందరు నేతలతో భూములు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి భయాందోళన కలిగించడం సరికాదని, తమగ్రామం ప్రాజెక్టుకు అవసరమైతే తమగ్రామానికే వచ్చి తమను మెప్పించి భూములను తీసుకోవాలన్నారు. లాఠీచార్జీలో గాయపడ్డ వారిని ఓదార్చి మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో వస్తున్న తమను రెండుసార్లు అరెస్టు చేశారని, చివరికి హైకోర్టు అనుమతితో గ్రామానికి వచ్చామని మాజీ డిప్యూటి సిఎం రాజనర్సింహ ఆవేదనతో తెలిపారు. అకారణంగా మీపై జరిగిన దాడి తమను బాధించిందని, మీ వివరాలను సేకరించి లాఠీచార్జీ జరిగిన తీరు, మీ బాధను లిఖితపూర్వకంగా హైకోర్టుకు నివేదిస్తామన్నా రు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీకు ధైర్యం కల్పించేందుకే మీ వద్దకు వచ్చామన్నారు. మీకు న్యాయం జరిగేందుకు తమవంతు కృషి చేస్తామని, ప్రజాకాంక్ష మేరకు ప్రజలవద్దకు వచ్చి సంప్రదింపులు జరిపి శాంతియుత వాతావరణంలో భూ ములు తీసుకుంటే తామెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు. పలువురు మహిళలు రోధిస్తు తమకు తగిలిన గాయాలను, లాఠీచార్జీ తీరును బృందానికి వివరించారు. ప్రభుత్వం హరితహారం మీద చూపుతున్న శ్రద్ద లాఠీచార్జీలో గాయపడ్డ వారి పై చూపకపోవడం బాధాకరమన్నారు. మహిళల పై మహిళ కానిస్టేబుళ్లు లేకుండా లాఠీచార్జీ చేయడం బాదకలిగించిందని మాజీ మంత్రి సునితారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డ చీకోడు బుచ్చవ్వను ఓదార్చి ఆస్పత్రిలో చికిత్స చేయించాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తుల అభీష్టం నెరవేరాలని, మనోధైర్యం కల్పించాలని గ్రామదేవత మైసమ్మకు పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి, ఐతొద్దీన్, మల్లారెడ్డి పాల్గొన్నారు. కాగా డిఎస్పీ నాగరాజు, సిఐ రామాంజనేయులు, ఎస్‌ఐ కృష్ణ, సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

చిత్రం.. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న కాంగ్రెస్ బృందం