S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేగంగా కృష్ణా పుష్కరాల పనులు

నల్లగొండ, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మంగా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డితో కలిసి మఠంపల్లి, దామరచర్ల మండలాల్లో కృష్ణానది వెంట నిర్మిస్తున్న పుష్కర ఘాట్‌ల నిర్మాణ పనులను, భక్తులకు కల్పిస్తున్న ఇతర వౌలిక వసతుల పనులను వారు పరిశీలించారు. కృష్ణా నదిలో మర పడవపై ప్రయాణించి దామరచర్ల మండలం వాడపల్లి వద్ద గల ఎనిమిది ఘాట్‌ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కులు వరద నీరు వస్తోందని, పుష్కరాల ప్రారంభ సమయానికల్లా జిల్లాలో కృష్ణానదికి వరద నీరు చేరుతుందన్నారు. నదిలో తగినంత నీరు రానిపక్షంలో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి పుష్కర భక్తుల స్నానాల కోసం నీటి విడుదలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారన్నారు. ఘాట్‌ల పనులు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 85 శాతం పూర్తయ్యాయని, ఇతర వౌలిక వసతుల పనులను ఈ నెల 5వ తేదీకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. దేవాలయాల్లో మరమ్మతుల పనులు జరుగుతున్నాయని ఇప్పటికే పుష్కరాలకల్లా జరిగే పనులు జరిపించి మిగతా వాటిని భక్తులకు ఇబ్బంది లేకుండా పుష్కరాల అనంతరం జరిపిస్తామన్నారు. పుష్కర భక్తులకు స్థానిక దేవాలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఉత్సవ విగ్రహాలు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. వారి వెంట ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జెసి ఎన్. సత్యనారాయణ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎన్.్భస్కర్‌రావు, ఎజెసి వెంకట్రావు, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ ధర్మానాయక్ ఉన్నారు.

చిత్రం.. వాడపల్లి ఘాట్ వద్ద కృష్ణా నదిలో మర పడవపై ప్రయాణిస్తూ
పుష్కర ఘాట్‌ల పనులను పరిశీలిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి