S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బహుజనులకు రాజ్యాధికారం..

రఘునాథపల్లి, ఆగస్టు 1: బహుజనులు రాజ్యాధికారం చేపట్టడానికి అందరూ ఏకం కావాల్సిన అవశ్యకత ఉందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మండలంలోని ఖిలాషాపురం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించి, నూతన కల్లు విధానాన్ని రూపొందించాలని, పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిర్వహించే బస్సు యాత్రను స్వామిగౌడ్‌తో పాటు పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, డా. తాటికొండ రాజయ్య, మాజీ ఎంపి మధుయాష్కి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంలతో కలిసి ప్రారంభించారు. అనంతరం సర్వాయి పాపన్న నిర్మించిన కోటలో జరిగిన సమావేశానికి బూడిద గోపి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూడున్నర దశాబ్దాల క్రితమే బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమాన్ని చేపట్టిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కిందన్నారు. అన్ని వర్గాల ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని చూసి బహుజనులను ఏకం చేసి పోరాటం చేసిన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. బ్రిటిష్ కాలంలో సర్వాయి పాపన్న పోరాటం, ఉద్యమస్ఫూర్తిని గుర్తించినప్పటికీ, భారత ప్రభుత్వం ఇప్పటివరకు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటి వరకు సాధించుకున్నది సగం తెలంగాణ మాత్రమేనని, బహుజనులకు న్యాయం జరిగినప్పుడే సంపూర్ణ తెలంగాణ సాధించుకున్నవారం అవుతామన్నారు. అప్పుడే సర్దార్ సర్వాయి పాపన్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. పాపన్న విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌తో పాటు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. రూ. వెయ్యి కోట్లతో గీత కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన గీత కార్మికులకు ఇప్పటి వరకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వడం లేదని, కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే అందిస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. గీత కార్మికుల ర్యాలీతో ఖిలాషాపురం సర్దార్ సర్వాయి పాపన్న కోట పులకరించింది. సర్వాయి పాపన్న నిర్మించిన కోటను, గుర్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ఎంవి రమణ, జిల్లా గీత కార్మిక సంఘం అధ్యక్షుడు రామస్వామి, నాయకులు నాసగోని పెద్దపురం, జనగాం శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, వినోద్, రాజు, భద్రయ్య, రమేష్, జడ్పీటిసి శారద, ఎంపిపి దాసరి అనిత, సర్పంచ్ అంజిరెడ్డి, ఎంపిటిసి కుమార్, మండల నాయకులు కుమార్‌గౌడ్, రాంబాబు, శ్రీహరి, వంగ శ్రీను, భీమగోని చంద్రయ్య, ఉత్తరయ్య, రాజయ్య, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

గోదావరి అంత్య పుష్కరాలు
రెండో రోజు పెరిగిన రద్దీ
* ఏర్పాట్లు చేస్తే భక్తులు పెరిగే అవకాశం
మంగపేట, ఆగస్టు 1: గోదివరి నది పరీవాహక ప్రాంతమైన మంగపేటలో పుష్కరఘాట్ వద్ద అంత్య పుష్కరాలు రెండవ రోజైన సోమవారం భక్తులు, సందర్శకుల రద్దీ పెరిగింది. పుష్కరాల ప్రారంభమైన తొలిరోజు ఆదివారం కొద్దిమంది మాత్రమే భక్తులు వచ్చినప్పటికీ పుష్కర స్నానాలకు, పిండ ప్రదాన కార్యక్రమానికి సోమవారం భక్తజనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం వందలాది మంది మంగపేట పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనే మంది తమ పిత్రు దేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయానికి వెళ్ళే భక్తులు ముందుగా గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించి వెళ్లారు. మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి తీరం సందడిగా మారింది. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు పుష్కరఘాట్ వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు అంత్య పుష్కరాలపై ప్రభుత్వం, అధికారులు ప్రచారం చేస్తే అంత్య పుష్కరాలకు భక్తులు వచ్చే అవకాశం ఉంది.