S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం

గజ్వేల్, ఆగస్టు 1 : పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా టిఅర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పథకాలు ఆదర్శంగా నిలుస్తుండగా, ప్రధాని నరేంద్రమోదీ సైతం మెచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, డబల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, మైనార్టీలకు షాదీముబారక్, గురుకుల పాఠశాలలు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి రోడ్ల నిర్మాణాలకు నిదుల మంజూరీ, పేదలకు వివిద రకాల ఆర్ధికాభ్యున్నతి పథకాలు వర్తింపజేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని సిఎం కెసిఆర్ పరుగులు పెట్టిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే గజ్వేల్ నుంచి సిఎం కెసిఆర్ ప్రాతినిత్యం వహిస్తుండడం ఇక్కడి ప్రజల అదృష్టం కాగా, రాష్ట్రంలోనే నియోజక వర్గం ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడి అధికారికంగా రాష్ట్ర పర్యటన చేపట్టి గజ్వేల్‌కు వస్తుండడం చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాద్యత పార్టీ శ్రేణులపై ఉందని వివరించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డిసిసిబి చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహంగీర్, మాజి చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి మడుపు బూంరెడ్డి, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, నేతలు డాక్టర్ యాదవరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, విద్యాకుమార్, మ ద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, చిన్న మల్లయ్య, వెంకటేశంగౌడ్, నిమ్మ రంగారెడ్డి, నరేందర్, సయ్యద్ సలీం, సింగం సత్తయ్య, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ముంపు గ్రామాల ప్రజలపై నిర్బంధం ఆపాలి
* రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 1: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలపై ప్రభుత్వం నిర్భందం ఆపాలని, భూ నిర్వాసితులు, నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అరెస్టు చేసి జైలుకు పంపిన సిపిఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఐబి అతిధి గృహంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలను పోలీసులు లాఠీ చార్జ్ చేసి గాయ పర్చారన్నారు. అంతే కాకుండా సిపిఎం, టిడిపి నాయకులతో పాటు నిర్వాసితులపై అక్రమ కేసులు బానాయించారని విమర్శించారు. ముంపుగ్రామాలకు ఎవ్వరిని వెళ్లనీయకుండా ఆధార్, గుర్తింపు కార్డులను అడగడం ఎంత వరకు సమంజసమన్నారు. మంత్రి హరీష్‌రావు నియంతన పాలన కొనసాగిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు స్వచ్చందంగా భూములిస్తే ఎందుకు పోలీస్ నిర్బందం కొనసాగిస్తుందో ప్రభుత్వం సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ప్రభుత్వ అధికారులందరూ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, నిర్బందాలు, లాటీలు, తూటాలతో ఉద్యమాలు అపలేరని హెచ్చరించారు. అరెస్టు చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ జి.్భస్కర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.మల్లేశం, కాంగ్రెస్ నాయకులు సాబేర్, కూన సంతోష్‌కుమార్, బిసి సంఘం జిల్లా అధ్యక్షులు బీరయ్య యాదవ్ పాల్గొన్నారు.