S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చర్మం పొడిబారి.. దళసరి పగుళ్లు

ప్ర:నా వయసు 35 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. ఈమధ్యకాలంలో నాకు ఉన్నట్టుండి చర్మవ్యాధి మొదలైంది. చర్మం పొడిబారిపోయి పగుళ్లు దళసరిగా మారడం, చర్మం నలుపు రంగులోకి మారడం, దురద ఎక్కువగా ఉండి నీరు లాంటిది కారడం వంటి సమస్యతో బాధపడుతున్నాను. నా సమస్యకు సరైన మందును సూచించగలరని మనవి.
-హరిప్రియ, హైదర్‌గూడ
జ: మీ సమస్యకు ‘గ్రాఫైటిస్’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడువారాలపాటు వాడగలరు. పౌష్టికాహారం, తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా ‘సి’ ఉన్నవి తీసుకోగలరు.
అధిక రుతుస్రావం అరికట్టేది ఎలా?
ప్ర: నా వయసు 33 సంవత్సరాలు. నాకు రుతుస్రావం నెల పొడవునా వస్తుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాను. కొన్నిసార్లు రుతుక్రమం సరిగానే ఉంటుంది. నా సమస్యకు మార్గం చూపగలరు..
-ఓ సోదరి, నల్లగొండ
జ: మీ సమస్యకు క్రోకాస్ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు వారాలపాటు వాడగలరు.
కదలిక వల్ల బాధ
ప్ర: నా వయస్సు 44 సంవత్సరాలు. నేను మెకానిక్ పనిచేస్తుంటాను. ఈ మధ్యలో నాకు మణికట్టు వద్ద నొప్పి బాధిస్తోంది. మణికట్టు కదలిస్తే బాధ తీవ్రమవుతుంది. అలాగే ఇంకొక సమస్య మలబద్ధకంతో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లగా ఎక్స్‌రే తీపించి ఏమీ లేదన్నారు. అయినా నొప్పి తగ్గట్లేదు. నా సమస్యకు సరైన మందును సూచించగలరు.
-కార్తిక, కరీంనగర్
జ: మీ సమస్యకు ‘బ్రయోనియా’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు వారాలపాటు వాడగలరు.