S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యాధులకు మూలం రక్తకణాల లోపం

రక్తంలోని ఒక రకం కణాలు లోపిస్తే ‘ఎప్లాస్టిక్ ఎనీమియా’ అంటారు. ఎర్ర రక్తకణాలు లోపించవచ్చు. ప్లేట్‌లెట్ కణాలు లోపించవచ్చు. తెల్ల రక్తకణాలు లోపించవచ్చు. ఈ స్థితిని ‘థ్రోంబోసైటోపీనియా’ అంటారు. సాధారణంగా ఈ రకం అనీమియాతో బాధపడేవాళ్ళలో మూడు రకాల రక్తకణాల లోపం ఉంటుంది. ఈ ఎనీమియా వైరల్ లేక బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో వస్తుంటుంది. కొన్ని మందుల రియాక్షన్‌వల్ల కాన్సర్ లేక రోగ నిరోధకాన్ని కలిగించేవే రోగాన్ని కలిగించే ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లవల్ల కూడా రావచ్చు.
ఈ సమస్యలుంటే పాలిపోయి, సన్నబడతారు. రక్తస్రావం అధికంగా అవుతుంటుంది. ఇన్‌ఫెక్షన్స్‌కి లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
బోన్‌మ్యారోని మైక్రోస్కోప్ క్రింద పరీక్షించి చూస్తే- రక్తకణాల్ని తయారుచేసే కణజాలాల స్థానంలో పెద్ద మొత్తాలలో కొవ్వు కనిపిస్తుంది. ఏ మందువల్ల వస్తోందంటే ముందు వాటిని ఆపేయాలి. రక్తస్రావం ప్లేట్‌లెట్ కణాలు తక్కువ కావడంవల్ల వస్తోందంటే మీ వైద్యుడు ప్లేట్‌లెట్ కణాల్ని ఎక్కిస్తారు.
మరీ తీవ్రమైన స్థితిలో ‘బోన్‌మారో’ మార్పిడి చేస్తారు. ఇప్పుడీ చికిత్సలు మన ప్రాంతంలోనే లభ్యమవుతున్నాయి. బోన్‌మ్యారో మార్పిడికి మ్యాచ్ అయిన డోనార్ దొరకాలి. ఈ చికిత్సలో రిస్క్‌లున్నా ప్రాణాన్ని కాపాడవచ్చు. ఈ రకం అనీమియాతో ప్రాణాల్ని పోగొట్టుకుంటున్న వార్ని కొందరినైనా కాపాడవచ్చు. కాబట్టి మిగతా అవయవాల దానంతోపాటు బోన్‌మారో దానం చేయవచ్చు. దానిని మాచ్ అయిన వాళ్ళకి అమర్చి, ఆ ప్రాణాన్ని వైద్యులు కాపాడుతారు.
పెరిగే వయసులో కలిగే ఇబ్బందులు
బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశ చాలా సున్నితమైంది. ఇది చాలా అపాయకరమైన దశ కూడా. ఈ దశలో వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు.
మొదటిది- ‘ఎనరాకియా’- శరీర బరువు గురించి ఆందోళన. ఆహారం తక్కువగా తీసుకోవడంవల్ల శరీరం అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుందని భావించి తిండిని తగ్గించి వేస్తారు. కొందరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని బరువు పెరిగిపోతారు. ఆదుర్దా చెందడంవల్ల బరువు తగ్గుతారు.
‘బులిమియా’- బరువులో తేడాలు వస్తాయి. విచారము తెచ్చిపెట్టుకున్నవారిలో.
ఆదుర్దా- డిప్రెషన్- క్రుంగిపోవడం, మామూలు ఇష్టాల్ని పట్టించుకోరు. బరువు తగ్గుతారు. సైకోసోమాటిక్ వ్యాధి ఇన్‌సోమ్నియాతో నిద్ర లేకుండా బాధపడతారు. డిప్రెషన్ ఎక్కువైతే ఆత్మహత్యా ఆలోచనలూ పెరుగుతాయి. వీటిని తట్టుకోవడానికి రకరకాల ‘డ్రగ్స్’కి అలవాటుపడతారు. దేనిమీదా మనసుని కేంద్రీకరించలేరు. సామర్థ్యం, కోరికలు కూడా తగ్గిపోతాయి. అసలు మొత్తం ప్రవర్తనలోనే మార్పు వస్తుంది. అందుకని ఈ వయసు పిల్లలని పెద్దవాళ్లు చాలా జాగ్రత్తగా గమనిస్తూ గైడ్ చేయాలి.