S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పొట్టివాళ్ళెందుకవుతారు?

కొంతమంది బాగా పొట్టిగా ఉంటారు. పిట్యూటరీ గ్రంథి లోపంవల్ల ఎత్తు ఎదగరు. మరికొన్ని కారణాలు తోడైనప్పుడే పెరగడం జరగకపోవచ్చు. వంశపారంపర్య లక్షణాలవల్ల కావచ్చు, పోషకాహారం లభించకపోవడంవల్ల ఎదుగుదల ఆగిపోవచ్చు. కొన్ని వ్యాధులూ పెరగనివ్వవు.
‘ఎకాండ్రోప్లాసియా’ అనే వ్యాధిలో కార్టిలేజ్ లోపంవల్ల చేతులు, కాళ్ళు సరిగా పెరగవు. తల, మొండెం బాగానే పెరుగుతుంది. పిట్యుటరీ గ్రంథి లోపంవల్ల కూడా ఎత్తు పెరగరు. చిన్నప్పుడు ఎముకలు పెరిగే దశలో పిట్యుటరీ గ్రోత్ హార్మోన్ లోపంతో సరిగా పెరగరు. గ్రోత్ హార్మోను ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇది బాల్య దశలోనే గుర్తించి ఇప్పించడం చాలా అవసరం. లేకపోతే పిల్లలు పెరగరు. పెద్దవాళ్ళయినా పొట్టిగానే ఉంటారు. ఇది అనాకారితనమనే కాదు, ఎన్నో ఇబ్బందులూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి పెరిగే పిల్లలపట్ల మరింత శ్రద్ధ వహించడం అవసరం, కాదంటారా?