S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మామను కడతేర్చిన అల్లుడు

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 2: మామను దారుణంగా హత్య చేసిన అల్లుడితో పాటు సహకరించిన స్నేహితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న తెలిపారు. మంగళవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కామెశ్ పాత్రో బ్రతుకుదెరువునిమిత్తం పాశమైలారంలో ఉంటూ ఇస్నాపూర్‌లోని అరబిందో కంపెనీలో బట్టలు ఇస్ర్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కామెశ్ భార్య ఆనారోగ్యానికి గురవడంతో సొంత బావమరిది కూతురు అయిన స్వప్నను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తనకు పిల్లను ఇచ్చిన మామ లింగారాజు (70) అడ్డురావడంతో అరబిందోలో పని చేసే స్నేహితుడు దాసరి రాజుతో కలిసి మామను చంపేందుకు పథకం పన్నాడు. జూలై 13న మధ్యాహ్నం స్నేహితుడు రాజుతో కలిసి మామ ఇంటికి వెళ్లాడు. కొంచం పని ఉంది బయటకు వెళ్లాద్దమంటూ మామ లింగారాజును స్కూటీపై ఎక్కించుకొని పోయారు. ఫసల్‌వాది గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జి కింద చంపడానికి అనువైన స్థలంగా బావించి తీసుకెళ్లారు. స్కూటి దిగిన మామపై అల్లుడు కామెశ్ కర్రతో దాడి చేయగా కింద పడిపోయిన మామను చెట్ల పొదల్లోకి లాక్కేళ్లి తవాల్‌తో ఉరి వేసి చంపేసి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టి అల్లుడిపై అనుమానంతో తమదైన రీతిలో విచారించగా స్నేహితుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో పాటు టిఎస్ 15ఇఎల్ 2411 స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.