S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నార్లాపూర్ రిజర్వాయర్‌తో కల్వకుర్తికి ప్రమాదం

మహబూబ్‌నగర్, ఆగస్టు 2: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కల్వకుర్తి ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. మగంళవారం ఆయన మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేవంలో నాగం మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి మొదట కేటాయించిన స్థలాన్ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. అదే జరిగితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రమాదం పొంచిందని అన్నారు. నార్లాపూర్ ప్రాజెక్టు దగ్గర బ్లాస్టింగ్ చేస్తే కల్వకుర్తి కాల్వలకు ప్రమాదం జరగనుందని అదేవిధంగా పంప్‌హాజ్‌లకు సైతం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్లను తరుచూ మారుస్తూ ప్రాజెక్టు ఖర్చు లక్ష కోట్ల వరకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డిజైన్ల మార్పు కేవలం కాంట్రాక్టులకు ప్రజాధనాన్ని అప్పగించి అక్కడ వచ్చిన ధనాన్ని కెసిఆర్ జెబ్బుల్లోకి మళ్లించుకోవడానికే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గత ఖరీఫ్‌లో రాష్ట్ర రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రైతులు కరువు బారిన పడ్డారని కేంద్ర ప్రభుత్వం ఇందుకుగాను దాదాపురూ.750 కోట్లు పంటనష్టపరిహారం మంజూరు చేసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండువంద కోట్లు ఇవ్వకుండా ఇప్పటికి రైతులకు పరిహారం ఇవ్వలేకపోయారని తెలిపారు. ఎంసెట్ లీకేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని లీకెజీల0 అసలు నిందితులను పట్టుకోకుండా బ్రోకర్లపైనే ప్రభుత్వం దృష్టి పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రోకర్లు ఎలా లీక్ చేస్తారని ఇందులో పెద్దతలకాయల హస్తంలేనిది, అసలు బ్రోకర్ల దగ్గరకు పేపర్ ఎలా చేరిందో బయటపెట్టాలని నాగం డిమాండ్ చేశారు. తక్షణమే మంత్రి కడియం శ్రీహరి రాజీనామ చేసి పదవి నుండి తప్పుకోవాలని తెలిపారు. గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినంత మాత్రానా రాజయ్యను పదవి నుండి తప్పించారని అదేవిధంగా సంబందిత మంత్రులను నైతిక బాధ్యతతో ముఖ్యమంత్రి తప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయ కురాలు పద్మజారెడ్డి, కొండయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు.