S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిషన్ భగీరథ పాలమూరుకు వరం

మహబూబ్‌నగర్, ఆగస్టు 2: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం పాలమూరు జిల్లాకు వరంలాంటిదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ మడంలంలోని చౌదర్‌పల్లి, బొక్కలోనిపల్లిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అదేవిధంగా ఊటకుంట దగ్గర మిషన్ భగీరథ ( వాటర్‌గ్రిడ్) పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి సారించిందని గత అరవై ఏళ్ల సమైక్య పాలనలో నష్టపోయిన వాటిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూడ్చడానికి కొత్త పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుందని తెలిపారు. ముఖ్యంగా వలసలకు నిలయంగా మారిన పాలమూరు జిల్లాకు మిషిన్ భగీరథ పథకం ఓ వరంలాంటిందని గుక్కెడు మంచినీటి కోసం పిల్లా పాపలతో కిలోమీటర్ల దూరం వెళ్లి మంచి నీరు తెచ్చుకుని దుస్థుతి ఈ జిల్లాలో ఉందని ఈ దుస్థుతి నుండి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నారని ప్రతి ఇంటికి మంచినీటి అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా పేరు ఉన్నప్పటికిని నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి రోజు మంచినీటిని కూడా సరఫరా చేయాలేదని ఆరోపించారు. పట్టణ ప్రజలకు ప్రతి రోజు మంచినీటి అందించాలనే ఉద్ధేశంతో జిల్లాలో మొదటి ప్రాధాన్యత క్రమంలో జిల్లా కేంద్రానికి మంచినీటిని ప్రతి రోజు అందించడానికి మిషన్ భగీరథ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను అందించడానికి వెల్కిచర్ల వరకు పైపులైన్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ నియోజవర్గంలోని అన్ని గ్రామాలకు మంచినీటిని ఏడాదిలోపు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సావిత్రి, జడ్పీటిసి శ్రీదేవి, వైస్‌ఎంపిపి సరస్వతమ్మ, మాజీ జడ్పిటిసి రాజేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.