S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాను హరితవనంగా మార్చాలి

మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సురక్ష కాలనీలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే భాద్యత కూడా తీసుకోవాలన్నారు. మొక్కలు నాటడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయని మొక్కల వల్ల స్వచ్చమైన గాలి రావడమే కాకుండా మానవ మనుగడకు చెట్లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. జిల్లాలో కరువు, అడవుల పెంపకానికి హరితహారం ఎంతో దోహదం చేస్తుందన్నారు. హరితహారం ప్రజలందరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి కనీసం 10 మొక్కలు నాటాలని, అడవులు పెరిగే తప్పా. పచ్చదనం పెరగదని మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని అసాధ్యమంటూ ఏది ఉండదని గతంలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.