S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆర్‌టిఎ కార్యాలయం ముందు ధర్నా

నల్లగొండ టౌన్, ఆగస్టు 2 : తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు పన్నును రద్దు చేయాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నల్లగొండ కాంట్రాక్టు కారియర్ బస్సు అసోసియేషన్, మాక్సి క్యాబ్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఉపాధ్యక్షులు ఐతరాజు రమేష్‌ల అద్యక్షతన ఆర్ టి ఏ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున దర్నా నిర్వహించారు. ఈ దర్నాలో వారు మాట్లాడుతూ గతంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 23 జిల్లాల సరిహద్దుల్లో వసూలు చేసిన పన్నును ప్రస్తుతం తెలంగాణ పది జిల్లాలో వసూలు చేయడం దారుణమన్నారు. ఇలాగే సరిహద్దు పన్నులు వసూలు చేస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీవన విధానం సాగదని, కుటుంబాలను పోషించే పరిస్థితులు ఉండవని, తామంతా కుటుంబ సభ్యులతో రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించి జీవనోపాదిని కాపాడాలని ఆక్రోశించారు. ఈ కార్యక్రమంలో గంజి యాదగిరి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.