S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా పుష్కర పనులు ముమ్మరం..!

నల్లగొండ, ఆగస్టు 2: జిల్లాలో కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తున్న నేపధ్యంలో అధికార యంత్రాంగం పుష్కర ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భక్తుల పుష్కర స్నానాలకు అవసరమైన ఘాట్‌ల నిర్మాణం దాదాపుగా పూర్తి అవుతుండటంతో ఇక ఘాట్‌లకు వచ్చివెళ్లేందుకు భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, పార్కింగ్, హోల్డింగ్స్, మంచినీరు వంటి వౌలిక వసతుల కల్పన పనుల్లో వేగం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. జిల్లాలో గత కృష్ణా పుష్కరాల్లో 11ఘాట్‌లు మాత్రమే ఉండగా ఈ దఫా భక్తుల రద్ధీ అధికంగా ఉంటుందన్న అంచనాతో 28ఘాట్‌లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా మఠంపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో ఘాట్‌ల సంఖ్యను రెట్టింపు చేశారు. పుష్కర పనుల పురోగతిని మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జి.జగదీష్‌రెడ్డిలు రెండు రోజుల పాటు ఘాట్‌లను సందర్శించి పరిశీలించి భక్తులకు వౌలిక వసతుల కల్పన పనుల వేగవంతంకై అధికారులపై మరింత ఒత్తిడి పెంచారు. ప్రస్తుతం ఘాట్‌లకు రంగుల ముస్తాబులు అద్దుతున్నారు.
భక్తులకు వసతులపై ఫోకస్
కృష్ణా పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఇబ్బందులు లేకుండా సంతోషంగా పుష్కర స్నానాలు, దైవ దర్శనాలు చేసుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని ఇప్పటికే సీఎం కెసిఆర్ మంత్రులకు, జిల్లా అధికారులకు మార్గదర్శకం చేసిన నేపధ్యంలో ఇందుకు అవసరమై వసతులపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఘాట్‌లలో తొక్కిసలాట లేకుండా భక్తుల రాకపోకలను క్రమబద్దీకరించేందుకు పార్కింగ్, హోల్డింగ్స్ పాయింట్ల నిర్మాణలు పక్కాగా ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌లో స్నానాలు పూర్తయ్యే భక్తులు బయటకు వెళ్లే సంఖ్యను అనుసరించి 29హోల్డింగ్స్ పాయింట్స్, 30పార్కింగ్ పాయింట్ల వద్ధ నిలిపివేసిన భక్తులను ఘాట్‌లలోకి వదులాలని నిర్ణయించారు. ప్రతి ఘాట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపి ఆర్టీసి బస్సుల ద్వారా మాత్రమే భక్తులు వెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ఏయే ఘాట్‌కు ఎక్కడి నుండి, ఎంత దూరం వెళ్లాలన్న వివరాలతో దారుల్లో సూచీకల బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర సమాచారం కోసం ప్రత్యేక యాప్ ‘నల్లగొండ కృష్ణా పుష్కరాలు 2016’ పేరుతో ఆవిష్కరించారు. ఇందులో 28ఘాట్‌లకు వెళ్లే మార్గాలు, చేరుకునేందుకు గుగూల్ మ్యాప్ మార్గదర్శకం, ఆ దారుల్లో వచ్చే ముఖ్య దర్శనీయ స్థలాలు వంటి వివరాలన్ని తమ మొబైల్ ఫోన్ల ద్వారా భక్తులు తెలుసుకోవచ్చు. దేవాలయాల వద్ధ భక్తులకు దర్శనంకు వీలుగా క్యూలైన్లు, రద్ధీనియంత్రణపై సైతం అధికారులు తొక్కిసలాట జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తం 15,535మంది ప్రభుత్వ సిబ్బంది పుష్కర ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా వారిలో 6,785మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారంతా కూడా మూడు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించనున్నారు. ప్రతిఘాట్‌కు ఒక ఇన్‌చార్జి చొప్పున, ఏడుగురు నోడల్ అధికారుల చొప్పున నియమిస్తున్నారు. ప్రతి ఘాట్ వద్ధ కంట్రోల్ రూంలో ప్రతి క్షణం 300మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. సిసి కెమెరాలు, వాకిటాకీలు, ఘాట్ వద్ధ ఐదుగురు గత ఈతగాళ్లు(నీలం రంగు), పారిశుద్ధ్యం సిబ్బంది(లెమన్ అఫ్రాన్స్), తాగునీరు(నీలం రంగు), విద్యుత్(ఎరుపురంగు), మరుగుదొడ్ల నిర్వాహణ(నారింజరంగు), కంట్రోల్ రూం సిబ్బంది (ఆకుపచ్చ రంగు) ప్రత్యేక డ్రెస్‌కోడ్‌లతో విధులు నిర్వహిస్తారు. పుష్కరాల్లో విధులు నిర్వహించే భక్తులకు 8,500మంది సిబ్బంది ‘అక్షయ పాత్ర’ ఎన్‌జివో సంస్థ ద్వారా ఉచిత అల్పాహార, మధ్యాహ్నా భోజనం నామామాత్ర ధరకు అందించనున్నారు.