S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిషన్ భగీరథకు రూ.2650 కోట్లు

ఆర్మూర్, ఆగస్టు 2: జిల్లాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2650 కోట్లు కేటాయించిందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ యోగితారాణా అన్నారు. మంగళవారం ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో పైప్‌లైన్ల కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఏ కార్యక్రమమైన విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. మూడు రోజుల్లో పైప్‌లైన్ల కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా కార్యక్రమాలను పూర్తి చేయించి ఈ నెల చివరికల్లా స్వచ్ఛమైన ఫిల్టర్ నీటిని గ్రామంలోని 376 కుటుంబాలకు అందిస్తామని అన్నారు. కేవలం ఈ గ్రామానికే పైప్‌లైన్ల కనెక్షన్ల కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ పథకం ద్వారా మొదటి విడతగా 121 గ్రామాలకు నీరందించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని, ప్రథమంగా నీటి ట్యాంకులు కలిగిన 25 గ్రామాలకు తాగునీరు అందిస్తామని అన్నరు. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి మల్లన్నసాగర్‌పైన ఐదారు చోట్ల ట్యాంకులు నిర్మించి తద్వారా అన్ని గ్రామాలకు నీటిని అందించే కార్యక్రమమని, కేవలం గ్రామాల్లోనే 150 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సకాలంలో మిషన్ భగీరథ పనులను పూర్తి చేసుకోవాలంటే ప్రజలు బాధ్యత తీసుకోవాలని, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రజల సహకారం అవసరమని అన్నారు. మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకొని ఉపయోగించుకుంటేనే మహిళకు గౌరవంగా ఉంటుందని న్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో 78 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. ఆరోగ్య లక్ష్మీ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భవతులు పాలు, గుడ్లు, పౌష్టికాహారం తీసుకుంటేనే రక్తహీనత లేకుండా ఉంటుందని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నరు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే ముందుకు ఆర్మూర్ ఆర్మూర్ నియోజకవర్గంలోనే 100 శాతం నల్లాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. హరితహారంలో కోమన్‌పల్లి గ్రామంలోని 40 వేల మొక్కలు నాటడం జరిగిందని, మొక్కలు నాటడం కాదని, నాటిన ప్రతి మొక్కకు లెక్క అప్పగించాలని అన్నారు.