S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

50 శాతం హరితహారం లక్ష్యం పూర్తి

వరంగల్, ఆగస్టు 2: జిల్లాలో హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 2.04 కోట్ల మొక్కలు నాటామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మంగళవారం చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ హరితహారం పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుండి కలెక్టర్ వాకాటి కరుణ, కమీషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్‌బాబు, జెసి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకొని సుమారు 50 శాతం లక్ష్యాలను పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో హరితహారంలో పాల్గొని లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. పురోగతిపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నామని, రానున్న రెండు వారాలలో 80 శాతం లక్ష్యాలకు చేరుకుంటామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా అన్ని శాఖల అధికారులను సమయత్తం చేస్తున్నామని తెలిపారు. సింగరేణి పనె్నండు లక్షల లక్ష్యానికి గాను సుమారు 8 లక్షల 59వేలు పూర్తి చేసిందని, రానున్న వారం రోజుల్లో వంద శాతం లక్ష్యాలను పూర్తి చేస్తుందని తెలిపారు. జిల్లాలో ప్రజల అవసరాల మేరకు మొక్కలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇప్పటికే నాటిన మొక్కలు సర్వేవైవల్ శాతంపై సర్వే చేశామని, 95 శాతం మొక్కలు సర్వే అయ్యాయని, మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. ఇజిఎస్ కింద చేపట్టిన మొక్కలకు ఏ విధంగా మెయింటేనెన్స్ చార్జీలు ఇస్తున్నారో అదే తరహాలో నాన్ ఇజి ఎస్ కింద నాటిన మొక్కలకు సైతం నిర్వహనకు ఖర్చులు చెల్లించాలని తద్వారా సర్‌వైవల్ శాతం మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీశ్‌శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని అన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. శాఖల వారీగా లక్ష్యాలను ఆయన సమీక్షించారు. టేకు, యూకలిప్టస్ మొక్కల డిమాండ్ మేరకు అందజేయాలన్నారు. వచ్చే ఏడాది హరితహారానికి ప్రస్తుత మొక్కలు డిమాండ్‌ను పరిగణలోనికి తీసుకొని ముందస్తుగా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఆ మేరకు నర్సరీలలో ఇప్పటి నుండి మొక్కలు పెంపకం చేపట్టాలని తెలిపారు. సెప్టెంబర్ చివరి మాసం కల్లా బ్యాగ్స్ ప్రొక్యూర్ చేయాలని, నిర్ణీత లక్ష్యాలను అదనంగా 20 శాతంతో ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారని, ఇది ముఖ్యమైన కార్యక్రమమని అధికారులు మరింత సమర్ధవంతంగా పని చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి తిరుపతిరావు, అటవీ శాఖ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.