S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భూపాలపల్లి ఏరియాలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి

పరకాల, అగస్టు 2: భూపాలపల్లి ఏరియాలో జూలైలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ పాలకుర్తి సత్తయ్య అన్నారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వర్షాల కారణంతో కెటికె ఓసిలో జూలై మాసంలో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగినప్పటికీ అండర్‌గ్రౌండ్ గనులు కొంత మేర ఉత్పత్తి పెంచుకొని ఏరియా ఉత్పత్తిలో కొంతమేరకు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఏరియాలో బొగ్గు రవాణా పెరిగిందని, గడిచిన ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో కన్న ఈ అర్థిక మాసం త్రైమాసికంలో 4.28లక్షల టన్నుల బొగ్గును ఎక్కువ రవాణా చేయడం జరిగిందని తెలిపారు. బి-గ్రేడ్ బొగ్గు ధరను టన్నుకు రూ. 1000 తగ్గించడంతో గతంలో భూపాలపల్లి ఏరియాలో బి-గ్రేడ్ బొగ్గును తిరస్కరించిన వినియోగదారులు తిరిగి మళ్లీ ఏరియాలోని బి-గ్రేడ్ బొగ్గును తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇందుకు కారణం విదేశాల్లో బొగ్గు రేటును పెంచడమేనని అన్నారు. ఇండోనేషియా, అస్ట్రేలియాలో టన్నుకు రూ. 660, సౌత్ ఆఫ్రికాలో టన్నుకు రూ. 600లు పెంచారని తెలిపారు. దీంతో మళ్లీ పాత వినియోగదారులంతా భూపాలపల్లి బొగ్గు కొనుగోలుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఏరియా రూ. 35 కోట్ల నష్టాల్లో ఉండేదని, ఇప్పటి వరకు రూ. 15 కోట్ల నష్టాన్ని తగ్గించుకొని లాభాల్లోకి పయనిస్తున్నామని చెప్పారు. ఇప్పటికి వరకు కెటికె 2వ గని రూ. 4కోట్ల లాభాల్లో ఉందని, కేటికె ఓసిపి రూ. 26 కోట్ల లాభాల్లో ఉందని మిగితా గనులు నష్టాల్లోనే ఉన్నాయని తెలిపారు. హరితహారంలో భాగంగా ఏరియాలో 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నా సింగరేణిలోనే అత్యధికంగా 13.26 లక్షల మొక్కలను నాటి ఇతర ప్రాంతాలకు అందించడం జరిగిందని తెలిపారు. ఇంకా కాలనీల్లో పండ్ల మొక్కలను అందించేందుకు సిద్ధం చేశామని తెలిపారు.