లుపిన్ చేతికి షియనోజి ఫార్ములాలు
Published Wednesday, 3 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ ఔషధరంగ దిగ్గజం లుపిన్కు చెందిన జపాన్ అనుబంధ సంస్థ క్యోవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ.. జపాన్‌కు చెందిన షియనోజి అండ్ కో నుంచి 21 ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ఒప్పందం కూడా కుదిరింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల (15.4 బిలియన్ యెన్లు)కు సదరు ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతోంది. దీంతో జపాన్ బ్రాండెడ్ ఫార్ములేషన్స్ మార్కెట్లోకి లుపిన్ ప్రవేశించినట్లవుతోంది. ఇక ఈ 21 ఉత్పత్తులు ఈ ఏడాది డిసెంబర్ నుంచి లుపిన్ హస్తగతం అవుతాయి. ఈ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ లావాదేవీల బదిలీ తదితర అనుమతులు రావాల్సి ఉందని మంగళవారం ఓ ప్రకటనలో లుపిన్ లిమిటెడ్ తెలియజేసింది.