S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

9 నుంచి బహుభాషా నాటకోత్సవాలు

హైదరాబాద్, ఆగస్టు 2: గత పదమూడు సంవత్సరాలుగా తెలుగు నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న ‘అభినయ’ తెలుగు నాటకాభివృద్ధి కోసం అనేక సరికొత్త కార్యక్రమాలను ఏర్పాటుచేసి నాటకరంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోందని, 2004లో హైదరాబాద్‌లో స్థాపించిన ‘అభినయ థియేటర్ ట్రస్ట్’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఇప్పటివరకు 35 ఉత్సవాలను ఏర్పాటుచేసిందని, ఇందులో 16 జాతీయ బహుభాషా నాటకోత్సవాలు ఉన్నాయని, దక్షిణ భారతంలో ఇన్ని బహుభాషా నాటకోత్సవాలను నిర్వహించిన సంస్థ ఇది ఒక్కటేనని, ప్రతి ఉత్సవం నాలుగు రోజులపాటు నిర్వహించిందని, ‘అభినయ’ ఇప్పటివరకు 230 నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేసిందని, తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు, తిరుపతి, విజయనగరం, కర్ణాటకలో బెంగళూరులో ఉత్సవాలను నిర్వహించిందని అభినయ శ్రీనివాస్ తెలిపారు.
గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటుచేస్తున్న బహుభాషా నాటకోత్సవం ‘అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్’ ఈ సంవత్సరం ఆగస్టు 9 నుండి 11 వరకు జరుపుతోందని చెప్పారు. ఈ బహుభాషా నాటకోత్సవానికి ఎంట్రీలను ఆహ్వానించి అందులో నుండి నాటకాలను ఎంపిక చేయడం జరుగుతోంది. ఈ ఉత్సవానికి దేశవ్యాప్తంగా వివిధ భాషల నుండి 6 దేశాల నుండి మొత్తం 134 ఎంట్రీలు వచ్చాయి. ఈ ప్రదర్శనలు అన్నీ ఉచితంగా చూడవచ్చు అని అభినయ శ్రీనివాస్ తెలిపారు.