S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రధాని మోదీ సభకు భారీగా తరలి రావాలి

మేడ్చల్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమాన్ని ప్రజలు భారీగా పాల్గొని విజయంవంతం చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఓంశివసాయి ఫంక్షన్‌హల్‌లో మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పనులను ప్రధాన మంత్రి మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభిస్తున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే బాధ్యత సిఎం నియోజకవర్గమైన గజ్వేల్ సమీప నియోజకవర్గాలైన మేడ్చల్, భువనగిరి, ఆలేరు, తదితర నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పగించారని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పదివేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున బస్సులను పంపిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లలా ద్వారా నీరందించేందుకు ఇప్పటికే 32 గ్రామాల్లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ద్వారా శామీర్‌పేట్ పెద్ద చెరువును నింపే ప్రక్రియను చేపట్టామని, అనవసరంగా కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, శామీర్‌పేట్ ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్ సర్పంచ్‌లు రాజమల్లారెడ్డి, బేరీ ఈశ్వర్, కందాడి నరేందర్‌రెడ్డి, దేశం నారాయణగౌడ్, తుడుం లింగం, నాయకులు విష్ణుచారి, రాఘవేందర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, రామస్వామి, మర్రి నర్సింహ్మరెడ్డి, వీర్లపల్లి భాగ్యరెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, దర్శన్, ప్రభాకర్, రాజేందర్, వీరస్వామి, దయానంద్, బొక్క కృష్ణారెడ్డి, మల్లేశ్, ఆజ్మత్‌ఖాన్, పి.రవీందర్ పాల్గొన్నారు.