S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని విద్యార్థి సంఘల వినతి

కుషాయిగూడ, నాచారం, ఆగస్టు 2: ఎస్సీ వర్గీకరణలో న్యాయబద్ధమైన పోరాటం ఉందని రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం, విరసం నాయకుడు వరవరరావు, బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని కోరుతు ఓయు అఖిల విద్యార్ధి జెఎసి నాయకులు ఆధ్వర్యంలో రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం, విరసం నాయకుడు వరవరరావు, బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్యను కలసి మద్దతు తెలుపాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని మందకృష్ణ మాదిగ.. దశాబ్ధ కాలంగా చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ పోరాటంలో దళిత విద్యార్థులు చేసిన పోరాట స్ఫూర్తిగా ఎస్సీ వర్గీకరణ పోరాటం చేసి సాధిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ప్రజాస్వామిక మేధావులు, బిసి సంఘల నాయకులు, రాజకీయ నాయకులు సంఘీభావంగా ఢిల్లీలో ఆగస్టు 10న జరిగే మహాధర్నాకు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి నాయకులు శరత్, లింగస్వామి, రంజీత్, అశోక్‌యాదవ్, ఆశప్ప, శ్రవణ్, వివేక్, నరేష్, మాతంగి, విజయ్, సుధాకర్ శేఖర్, సంజీవ్, సోమశేఖర్, దినేష్ పాల్గొన్నారు.