S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజారవాణా వ్యవస్థకు కార్పొరేట్ సంస్థల చేయూత అవసరం

హైదరాబాద్, ఆగస్టు 2: హైదరాబాద్ వంటి మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న పట్టణీకరణ, జనాభా రద్ధీకి అనుకూలంగా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కార్పొరేట్ సంస్థలు చేయూతనివ్వాలని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్.రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘స్మార్ట్‌సిటీ పునరుద్దరణలో ప్రభుత్వం, ప్రైవేటు సెక్టార్, టెక్నాలజీల పాత్ర’ అన్న అంశంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ ప్రజారవాణా వ్యవస్థ అనేది స్మార్ట్‌సిటీ ప్రతిపాదనల్లో అన్నింటికన్నా కీలకమైందని, ప్రజలు ఆశించిన విధంగా ఈ వ్యవస్థను రూపకల్పన చేయాలంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సెక్టార్‌లోని కార్పొరేట్ సంస్థలు కూడా కలిసిరావల్సిన అవసరముందని, ఈ దిశగా ముందుకొచ్చినపుడే సిఎం కెసిఆర్ విజన్ నిజమవుతోందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో సుమారు 40లక్షల వాహనాలున్నాయని, ప్రతి ఏటా అదనంగా మరో నాలుగు లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయన్నారు. ఫలితంగా పాదచారులకు నగరంలోని నడిచి వెళ్లేందుకు స్థల లేకుండాపోతోందన్నారు. అంతేగాక, వాయు, శబ్ద కాలుష్యం కూడా ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోందన్నారు. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సైడ్‌వాక్‌లు, స్కైవాక్‌లు వంటివి సమీపంలోని స్కూళ్లు, ఆసుపత్రులతో పాటు పలు ప్రైవేటు భవనాలు, అపార్ట్‌మెంట్లకు నేరుగా మెట్రో స్టేషన్ చేరుకునేందుకు వీలుగా నిర్మించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రతి మెట్రోరైలు స్టేషన్ నుంచి సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకును ఫీడర్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. అంతేగాక, మెట్రో స్టేషన్‌లో రైలు దిగగానే సమీపంలోని కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా మెట్రో స్టేషన్లలో బైసైకిళ్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాక, మెట్రోరైలు రాకపోకలను నగరంలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లకు, ఎంఎంటిఎస్ స్టేషన్లలోని రైళ్ల రాకపోకలతో, ఆర్టీసి బస్సుల రాకపోకల వేళలతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ అనేది ప్రజల అంచనాలకు తగిన విధంగా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, ఆర్థిక, సామాజికపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చే విధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల రంగంలో హైదరాబాద్ మెట్రోరైలు అనేది అంతర్జాతీయ ఇంజనీరింగ్ నైపుణ్యత, భారీ ప్రాజెక్టులకు పెట్టుబడులు, ఆర్థికపరమైన అంశాలకు చక్కటి ఉదహరణ అని ఎన్వీఎస్ రెడ్డి వరించారు. ఈ సమావేశంలో షాంగై నగరానికి చెందిన మెక్ ఇనే్స గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జోనథన్ వయ్‌ట్‌జోల్, హాంగ్‌కాంగ్ యూనివర్శిటీకి చెందిన గయ్‌పెర్రీ, ఐఎస్‌బి అసొసియేట్ ప్రొఫెసర్ శ్రీనిరాజు, ఐఎస్‌బి మాజీ డీన్‌లు అజిత్ రంగ్నేకర్, ఎం. రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.