S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఔట్‌సోర్సు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి

హైదరాబాద్, ఆగస్టు 2: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టి, మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఒకవైపు సిఎం కెసిఆర్ పిలుపునిస్తుంటే మరోవైపు అధికారులే ఈ కార్యక్రమం నిర్వీర్యం చేసే విధంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో కీలక పాత్రపోషిస్తున్న పార్కు విభాగం ఔట్‌సోర్సు ఉద్యోగులకు అధికారులు జీతాలు చెల్లించటం లేదని, వెంటనే మున్సిపల్ మంత్రి కెటిఆర్ జోక్యం చేసుకుని జిహెచ్‌ఎంసిలోని అన్ని విభాగాల ఔట్‌సోర్సు ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆదిల్ షరీఫ్ కోరారు.
మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఏళ్ల నుంచి కార్మికులుగా పనిచేస్తున్న చాలా మందికి కనీసం ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కూడా కల్గించటం లేదని వాపోయారు. ఈ విషయంపై ఇప్పటికే పలు సార్లు ఉన్నతాధికారులను కలిస్తే కొత్తగా ఏజెన్సీల నియామకం జాప్యం కావటంతో జీతాలు చెల్లించటంలో కాస్త ఆలస్యమైందని చెబుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి ప్రజలకు అందిస్తున్న సేవల్లో కీలక పాత్ర పోషించేది ఔట్‌సోర్సు ఉద్యోగలేనని ఆయన గుర్తుచేశారు. వీరంతా కూడా జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వారు ఎలా జీవిస్తారని ఆదిల్ ప్రశ్నించారు.
వెంటనే జీతాలు చెల్లించాలి
* కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశం
కొత్త ఎజెన్సీల నియామకం విషయంలో కాస్త జాప్యం కావటంతో జీతాలు చెల్లించేందుకు ఆలస్యమైనా, వెంటనే (బుధవారం సాయంత్రంలోపు)జీతాలు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. జీతాల చెల్లింపునకు సంబంధించి ఏమైనా లోపాలుంటే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా బయోడైవర్శిటీ విభాగంలోని 181 మంది మాలీలుగా ఔట్‌సోర్సుగా పనిచేస్తున్నారని, వీరందరికి సంబంధిత కాంట్రాక్టర్ జీతాలు చెల్లిస్తున్నట్లు బయోడైవర్శిటీ డైరెక్టర్ తెలిపారు. ఈస్ట్‌జోన్‌లో కాంట్రాక్టర్ల ఎంపిక విషయంలో కాస్త జాప్యం జరుగుతున్నందున 8 నెలలుగా జీతాలు చెల్లించలేకపోయామని, 948 మంది శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ల జీతాలను కూడా వెంటనే చెల్లించనున్నట్లు శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ కమిషనర్‌కు వివరించారు.

ఆంధ్రభూమి బ్యూరో