S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘మెట్రో’ నిర్మాణ పనులు వేగవంతం

హైదరాబాద్, ఆగస్టు 2: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే నగరవాసులకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మెట్రోరైలు ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయని మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ చాంబర్‌లో మెట్రోరైలు పనులపై స్పెషల్ టాస్క్ఫోర్సు సమావేశంలో ఎండి పనుల పురోగతిపై స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు 58 కిలోమీటర్ల పొడువున మెట్రో కారిడార్లలో పునాదులు పూర్తయ్యాయని, 56 కిలోమీటర్ల పొడువున పిల్లర్లు, 46 కిలోమీటర్ల పడువున వయోడక్ట్‌ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ విభాగాలు ఎంతో చక్కటి సమన్వయంతో పనులను చేపడుతున్నాయని వివరించారు. సమావేశంలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.జి.గోపాల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి, మైనార్టీ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) కె. జితేందర్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, మెట్రోరైలుతో పాటు జిహెచ్‌ఎంసి, జిల్లా కలెక్టర్, జలమండలి, విద్యుత్, ఆర్టీసి ఇతర విభాగాలకు చెందిన అధికారులతో చర్చించిన అనంతరం మెట్రోరైలు పనులకు సంబంధించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి.
ఎస్‌టిఎఫ్ సమావేశం నిర్ణయాలు
* మంగళవారం జరిగిన ఎస్‌టిఎఫ్ మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా గతంలో సూచించిన 37 ఆస్తులకు సంబంధించి స్థల సేకరణ పూర్తయిందని, అందులోని నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించగా, ఉభయ జిల్లాలకు చెందిన రెవెన్యూ యంత్రాంగం ఎంతో ముందు చూపుతో మున్ముందు పెరిగే ట్రాఫిక్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని స్థల సేకరణ ప్రక్రియను చేపట్టాలని సిఎస్ రాజీవ్ శర్మ ఆదేశించారు.
* సమావేశంలో భాగంగా వివిధ శాఖల మధ్య స్థల సేకరణ ప్రక్రియకు సంబంధించిన తీరును సమీక్షిస్తూ బేగంపేటలోని పోస్ట్ఫాసు భవనం టెర్రస్ భాగాన్ని వెంటనే మెట్రోరైలుకు అప్పగించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగరాదని, ఒకవేళ జరిగితే త్వరలో ప్రదాన నరేంద్రమోది అధ్యక్షతన జరిగే ‘ప్రగతి’ సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు.
* మెట్రోరైలు కారిడార్‌కు ఇరువైపులా కూడా ట్రాఫిక్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, ప్రాధాన్యత క్రమంలో బ్యారికేషన్ పనులపై దృష్టి సారించాలన్నారు. వర్షాకాలాన్ని, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిటి, సిసి రోడ్లకు మరమ్మతులు చేయటంతో పాటు ఎప్పటికపుడే రోడ్లపై గుంతలను పూడ్చివేయాలని సిఎస్ ఆదేశించారు.
* నగరంలో ఇరుకుగా ఉన్న కూడళ్లు, ప్రాంతాల్లో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ అధికారులు భూగర్భంలోని విద్యుత్ కేబుళ్లను హెచ్‌ఎంఆర్ అధికారులు కోరిన విధంగా వీలైనంత త్వరగా మరో చోటుకు మార్చే పనులు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా ఎలాంటి ఆటంకాల్లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగుతోందని సిఎస్ అభిప్రాయపడ్డారు.