S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వివాహిత హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

వనస్థలిపురం, ఆగస్టు 2: ఆర్థిక సమస్యలతో ప్రియురాలిని స్నేహితుని సహాయంతో హత్యచేసి ఆమె వద్ద ఉన్న నగలను తీసుకొని పారిపోయిన ఇద్దరు వ్యక్తులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతనెల 28న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ద్వారకామాయినగర్‌లో అనుమానాస్పద స్థితిలో గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. సైబరాబాద్ ఈస్ట్ జోన్ క్యాంప్ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాలప్రకారం నగరంలోని చంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్న డి.అర్చన (30) రెండుఏళ్ల క్రితం టాక్సీడ్రైవర్‌గా పని చేస్తున్న రామును వివాహం చేసుకుని ద్వారకామయినగర్‌లో నివాపముంటోంది. వివాహానికి ముందు ఆమెకు తమిళనాడు, మధురై ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌తో సంబంధం ఉండేది. అయితే అతను ప్రస్తుతం నగరంలోని బండ్లగూడ ప్రాంతంలో నివాసముంటున్నాడు. టిఫిన్ సెంటర్ నడుపుతున్న రాజ్‌కుమార్, అర్చన భర్త ఇంట్లో లేని సమయంలో అర్చన ఇంటికి వస్తుండేవాడు.ఆర్థిక సమస్యలున్నాయని చెప్పిన రాజ్‌కుమార్‌కు అర్చన తనవద్ద ఉన్న గోల్డు చైన్ కూడా ఇచ్చింది. ఇదే అలుసుగా తీసుకున్న రాజ్‌కుమార్ ఆమె వద్ద ఉన్న నగలను కాజేయాలని పథకం పన్నాడు. గత నెల 28న బండ్లగూడ లో నివాసం ఉంటున్న తన స్నేహితుడు రాముతో కలిసి రాజ్‌కుమార్ మద్యం తీసుకొని అర్చన ఇంటికి వెళ్లారు.ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో అర్చనను గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చీరతో ఫ్యానుకి ఉరివేసి ఆత్మ హత్య చేసుకున్నట్టు చిత్రీకరించి ఆమె ఒంటిపైన ఉన్న 4తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు. కేసు నమోధు చేసుకున్న పోలిసులు పూర్తి స్తాయిలో దర్యాప్తు చేసి ఫోన్‌కాల్స్ ఆధారంగా రాజ్‌కుమార్, రామ్‌లను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ మురరళీకృష్ణ, ఎస్‌ఐలు నాగార్జున, డి.విజయ్, మహేష్ పాల్గొన్నారు.