S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు

నరసాపురం, ఆగస్టు 2: గోదావరి అంత్య పుష్కరాలు మూడవ రోజు మంగళవారం వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పిండ ప్రదానాలకు అమావాస్య మంచిదని భావించిన భక్తులు ఎక్కువగా పిండ ప్రదానాలు చేశారు. పట్టణంలో ఎన్టీఆర్ పుష్కరఘాట్, కొండాలమ్మ, అమరేశ్వర స్వామివారి ఘాట్లలో ముందుజాగ్రత్తగా 28 మంది గజ ఈతగాళ్ళను నియమించారు. అలాగే ఎనిమిది బోట్లను సిద్ధంగా ఉంచినట్లు ఎఫ్‌డిఒ కె రమణకుమార్ తెలిపారు. వైఎన్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు వలంటీర్లు సేవలను కొనసాగిస్తున్నారు. వశిష్ఠ ఎన్టీఆర్ ఘాట్‌లో ఒక మహిళ పొగొట్టుకున్న బంగారం చెవిదిద్దును ఘాట్ ఆఫీసర్ ద్వారా తిరిగి మహిళకు అప్పగించారు. నన్నయ వర్శిటీ సలహా సంఘం సభ్యులు రంగసాయి ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు.
డివిజన్‌లో 10,460 మంది స్నానాలు
నరసాపురం డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన 15 పుష్కరఘాట్లలో 10,460 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. పట్టణంలో 1952, రూరల్‌లో 353, యలమంచిలిలో 4,856, ఆచంటలో 3289 పుణ్యస్నానాలు ఆచరించారు.