S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలెక్టర్ సుడిగాలి పర్యటన

ఏలూరు, ఆగస్టు 2 : జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మంగళవారం ఏలూరు నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. దాదాపు 50 ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను స్వయంగా అధ్యయనంచేశారు. ఉపాధి కల్పన కార్యాలయం, మైక్రో ఇరిగేషన్, సోషల్ వెల్ఫేర్, పశుసంవర్ధక శాఖ, మైనార్టీస్ కార్యాలయం, డిపివో ఆఫీస్, అటవీ శాఖ, వయోజన విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యు ఎస్, జిల్లా పరిషత్‌లతోపాటు ఇతర కార్యాలయాలను తనిఖీ చేశారు. కాగిత రహిత పాలన అందించాలనే ఉద్దేశ్యంతో గత ఏడాది నుంచి జిల్లాలో ఇ-ఫైలింగ్ విధానాన్ని చేపట్టామని, అయినప్పటికీ కొన్ని శాఖల్లో ఇంకా మాన్యువల్‌గానే పరిపాలన సాగడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాబోయే వారం రోజుల్లో అన్ని ఫైళ్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్ అండ్ బి, పోలవరం ప్రాజెక్టు ఎస్ ఇ, ఇ ఇ కార్యాలయాల్లో ఇంకా ఇ-ఫైలింగ్ విధానం సక్రమంగా అమలు జరగడం లేదని, వెంటనే ఈ విధానాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి ఎస్ ఇ కార్యాలయంలో ఉద్యోగుల సమగ్ర వివరాల పట్టిక లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. వయోజన విద్యాశాఖ కార్యాలయంలో మూడు దశాబ్ధాల నాటి రికార్డులను బీరువాలో ఉంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీ రికార్డును వెంటనే స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో భద్రపర్చాలన్నారు. ఆర్‌డబ్ల్యు ఎస్ కార్యాలయంలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా వుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆఫీసులో మందుల బాక్సులా!
ఆఫీసులో మందుల బాక్సులా, కార్యాలయం అంతా మందుబిళ్లల పెట్టెలా, ఈ పెట్టెలు ఇక్కడ ఎందుకు పెట్టారంటూ డిఎంహెచ్ ఓ డాక్టర్ కె కోటేశ్వరిని కలెక్టర్ భాస్కర్ ప్రశ్నించారు. దీనిపై డి ఎంహెచ్ ఓ మాట్లాడుతూ సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఖాళీ లేనందున ఈ మందుల పెట్టెలను కార్యాలయంలో వుంచడం జరిగిందని, రెండ్రోజుల్లో వీటిని ఆరోగ్య కేంద్రానికి తరలిస్తామని చెప్పారు.
మళ్లీ వస్తా... ఇలాగే ఉంటే సస్పెండ్‌చేస్తా
పలు ప్రభుత్వ కార్యాలయాలను మంగళవారం తనిఖీ చేసిన కలెక్టర్ మళ్లీ వారం ఆఫీసులు తనిఖీ చేస్తానని, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. చొదిమెళ్లలోని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఉద్యోగుల వివరాల బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజల సౌకర్యార్ధం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్సైజ్ కార్యాలయంలో ఇ-ఫైలింగ్ విధానం ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చౌదరిని ప్రశ్నించారు. భూగర్భజల శాఖ కార్యాలయంలో ఇంకుడు గుంతలు లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీనాపేటలోని పట్టుపురుగుల కార్యాలయాన్ని తనిఖీచేసి డిడి సుబ్బరామయ్య కార్యాలయంలో లేకపోవడాన్ని ప్రశ్నించారు. కార్మిక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇ-ఫైలింగ్ విధానంలో పూర్తిస్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న కార్మిక శాఖ అధికారులు, సెరీ కల్చర్ డిప్యూటీ డైరెక్టర్, పోలవరం ప్రాజెక్టు ఎస్ ఇ, ఇ ఇలకు ఛార్జిమెమోలు జారీచేస్తామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రభురాజ్‌కుమార్, ఆర్‌డబ్ల్యు ఎస్ ఇ అమరేశ్వరరావు, డిపివో కె సుధాకర్, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మలాకుమారి, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.