S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తాటి టెంకలకు తేగ డిమాండు

బుట్టాయగూడెం, అగస్టు 2: ఏజన్సీ తాటి టెంకలపై డెల్టా, మెట్టప్రాంత తేగల వ్యాపారుల కన్నుపడింది. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పొలాలు, గరువు భూములను చేపల చెరువులు, కోళ్ల ఫారాలు, పరిశ్రమలుగా చేయడంతో ఉన్న కొద్దిపాటి భూముల్లో గట్లమీద తాటితోపులు పెంచకపోవడంతో అక్కడి తేగల రైతులకు తాటి టెంకలు దొరకడం గగనమైపోతోంది. దీంతో వారు తాటి టెంకల కోసం పశ్చిమ ఏజన్సీపై పడ్డారు. కొందరు తేగల ఉత్పత్తిదారులు తాటితోపులు ఎక్కువగా ఉన్న గిరిజన గ్రామాల్లో గిరిజనులతో తాటి టెంకలను, రాలిపడ్డ తాటిపండ్లను పోగుచేయించి, కొద్దోగొప్పో సొమ్ములు ముట్టజెప్పి, ఇక్కడ నుండి భారీగా తాటి టెంకలను తరలిస్తున్నారు. వీటిని పాతర వేసి, తేగలను పట్టణ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సుమారు మూడు తేగలను కనీసం పది రూపాయలకు అమ్మి, భారీగానే లాభాలను గడిస్తారు. డెల్టా, మెట్ట నేలల కంటే ఏజన్సీలోని ఎర్ర ఇసుక, గరప నేలల్లో పండిన తాటి టెంకల నుండి వచ్చిన తేగల రుచి ఎక్కువ కావడం కూడా ఈ తాటి టెంకల రవాణాకు కారణంగా చెప్పవచ్చు. ఏదేమైనా గిరిజనులకు వర్షాకాలం తాటి టెంకల నుండి కొంత ఆదాయం లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దొరమామిడి, దాసియ్యపాలెం, విప్పలపాడు తదితర గ్రామాల్లో కొంతమంది భారీగా తేగలు పాతరలు వేసి, చిన్నచిన్న వ్యాపారులకు టోకుగా తేగలను కాల్చి అమ్ముతుంటారు. మండలంలో ప్రతి గ్రామంలోను విస్తారంగా తాటి తోపులు ఉండడంతో టెంకల ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. వ్యవసాయ శాఖ, ఐకెపి మహిళా సమాఖ్య గిరిజనులకు, మహిళలకు తేగల ఉత్పత్తి, వ్యాపారంపై అవగాహన కల్పిస్తే లాభదాయకంగా ఉంటుందని కొందరి అభిప్రాయం.