S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పితాని తీరుపై ఆచంట నేతల అసంతృప్తి

ఏలూరు, ఆగస్టు 2 : తమ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తమను గుర్తించడంలేదని ఆచంట నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు మంగళవారం టిడిపి జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. తాము 1983 నుంచి పార్టీలోనే కొనసాగుతున్నామని, 2014 శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పితానికి టిక్కెట్ ప్రకటిస్తే తాము నిరాకరించామన్నారు. అధినేత చంద్రబాబు నాయకులను సమన్వయ పరచి సత్యనారాయణకు టిక్కెట్ ఇస్తామని ఒప్పించారన్నారు. ఆయనకు ఇచ్చిన హామీ మేరకు తాము పితాని సత్యనారాయణ గెలుపుకోసం రేయింబవళ్లు కృషి చేశామన్నారు. కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమకు తెలపడంలేదని, కమిటీల ఏర్పాటులో ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పార్టీలో మొదటి నుంచి వున్న వారిని గుర్తించడం లేదన్నారు. ఈ విషయాలు ఇన్‌ఛార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లామని, సమస్య పరిష్కారం కాకపోతే అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. ఆచంట ఎంపిపి మేకా పద్మకుమారి, పెనుమంట్ర ఎంపిపి కలిగిపూడి సరోజిని, పెనుమంట్ర జడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి, ఆచంట నియోజకవర్గ టిడిపి కన్వీనర్ గొడవర్తి శ్రీరాములు, పెనుమంట్ర మండల పార్టీ అధ్యక్షులు తమ్మనపూడి శ్రీనివాసరెడ్డి, ఆచంట మండల టిడిపి ఉపాధ్యక్షులు గెద్దాడ సన్యాసిరావు, మేకా జానకిరామయ్య, గెద్దాడ సన్యాసిరావు అసంతృప్తి వ్యక్తంచేసిన వారిల ఉన్నారు.