S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజాస్వామ్యమా... పోలీసు రాజ్యమా!

వీరవాసరం, ఆగస్టు 2: ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో, పోలీసు రాజ్యం నడుస్తుందో తెలియడంలేదని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేకహోదా కావాలంటూ అఖిలపక్షం ఇచ్చిన రాష్టవ్య్రాప్త బంద్ పిలుపులో భాగంగా మంగళవారం వీరవాసరంలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండు సెంటరులో సిపిఎం రాష్ట్ర నాయకులు జుత్తిగ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నినాదాలు చేస్తుండగా అక్కడకు చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. పాలకొల్లు సిఐ చంద్రశేఖర్ సిపిం సీనియర్ నేతలు జుత్తిగ నరసింహమూర్తి, యండమూరి సుబ్బారావును బలవంతంగా జీపులో ఎక్కించి పోలీసుస్టేషనుకు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలియచేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో ఉద్యమాన్ని ఆపడానికి చంద్రబాబు కుట్రపన్నుతున్నారని నరసింహమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సిపిఎం నాయకులు బాలం విజయ్‌కుమార్, మృత్యుంజయుడు ఆధ్వర్యంలో 20 మంది పోలీస్‌స్టేషన్‌కు వద్దకు వెళ్లి తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని లేకుండా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సిపిఎం నాయకులను విడుదల చేశారు.