S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బంద్ సంపూర్ణం

ఏలూరు, ఆగస్టు 2 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపిలు ప్రజలను మోసగిస్తున్నాయంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బంద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగాను, సంపూర్ణంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అలాగే విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో అవి తెరచుకోలేదు. వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. ఇక ఆర్‌టిసి బస్సుల రాకపోకలు దాదాపుగా నిలచిపోయాయి. ఒకటి రెండు చోట్ల పోలీసుల సహకారంతో కొన్ని సర్వీసులు తిరిగినా మొత్తంగా చూస్తే బస్సుల రాకపోకలు బంద్ కారణంగా నిలచిపోయాయనే చెప్పాలి. కాగా ప్రత్యేక హోదా అంశం కావడంతో వైకాపా ఇచ్చిన బంద్ పిలుపునకు వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్, మిగిలిన పక్షాలన్నీ ముందుగానే మద్దతు ప్రకటించాయి. అలాగే వివిధ కార్మిక, సామాజిక సంఘాలు బంద్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించాయి. దీంతో బంద్‌కు ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. జిల్లా కేంద్రమైన ఏలూరులో వైకాపా జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని మంగళవారం తెల్లవారుజాము నుంచి బంద్ నిర్వహణను పర్యవేక్షించారు. వైకాపా నేతలతోపాటు వామపక్ష పార్టీల నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు బంద్ నిర్వహణలో నేరుగా పాల్గొన్నారు. ఏలూరుతోపాటు తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా బంద్ సందర్భంగా అన్ని కార్యకలాపాలు నిలచిపోయాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు మూతపడకపోవడాన్ని గమనించిన ఆందోళనకారులు అక్కడకు చేరుకుని నిరసన తెలపడంతో ఆ కార్యాలయాలను కూడా మూసివేశారు. ఏలూరులో ఒకటి రెండు చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని కొంతమంది నాయకులను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించడంతో పరిస్థితులు సర్దుమణిగాయి. అయితే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలంటూ మరోసారి వైకాపా, ఇతర పక్షాల నాయకులు పోలీసు స్టేషన్ల వద్ద ఆందోళనలుచేపట్టడంతో వారిని విడుదల చేశారు. ఏలూరుతోపాటు మిగిలిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బిజెపి, టిడిపిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం వల్లే రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ వారు విమర్శలు గుప్పించారు. కాగా అధికార పార్టీకి చెందిన ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఈ ఆందోళనకు పూర్తి భిన్నంగా వినూత్న రీతిలో ప్రత్యేక హోదా కోసం తన ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటి, బస్టాండ్‌ను శుభ్రం చేసి తన నిరసనను తెలిపారు.