S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదాకు కృషిచేస్తాం మంత్రులు అయ్యన్న, సుజాత

ఏలూరు, ఆగస్టు 2 : ఎన్నికల ముందు బిజెపి ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల అభీష్టాల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చేందుకు తగిన కృషి చేస్తామని, ప్రజలు అధైర్యపడాల్సిన పని లేదని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైందని, నియోజకవర్గాల వారీగా సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం చేసిన పనులపై ప్రజల్లో ప్రభావం ఎలా వుందని, ఇంకా ఏ విధమైన పనులు పార్టీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఏర్పాటు చేశామని చెప్పారు. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, ఇప్పటి వరకు సహనం పాటించామని, ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా దశల వారీగా ఒత్తిడిచేస్తామని స్పష్టంచేశారు. కేంద్రంపై పోరాటం ఎందుకంటూ ఇప్పటివరకు సంకీర్ణంగా వున్నాం కాబట్టి విడతల వారీగా చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో నచ్చచెబుతున్నారని, అయినప్పటికీ గత వారంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం అనంతరం తమలో నిరుత్సాహం వచ్చిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
మరో మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బిజెపి, టిడిపి ప్రభుత్వాలపై ఎన్నో ఆశలుపెట్టుకుని అఖండ విజయం చేకూర్చారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభీష్టం ప్రత్యేక హోదా రావడమేనని, ఇందుకోసం పార్టీ తగిన కృషి చేస్తుందని అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.