S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహం

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 2: శారీరక ధృడత్వానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ద్రోహదపడతాయని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. పట్టణంలో రాజీవ్ క్రీడామైదానంలో మంగళవారం కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పూర్వకాలంలో కబడ్డీకి ఎంతో ప్రాచుర్యం ఉండేదని, ఎక్కువమంది యువకులు కబడ్డీపైనే ఆసక్తి చూపేవారన్నారు. రానురానూ కబడ్డీపై యువకులకు ఆసక్తి తగ్గినా, కబడ్డీకి ఆదరణ తగ్గలేదని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువకులు ఎక్కువగా కబడ్డీ పోటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పారు. సంక్రాంతి రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు కబడ్డీ ఆటలతో కళకళలాడుతాయని అన్నారు. పట్టణంలో క్రీడాకారులకు పెద్ద దిక్కుగా ఉన్న రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అన్ని విధాలా అభివృద్ధికి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక్కడ వౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు మాట్లాడుతూ క్రీడల పోటీలలో ఓటమి చెందిన క్రీడాకారులు నిరాశ చెందకుండా విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఓటమిని స్ఫూర్తిగా తీసుకోని విజయం వైపుదృష్టి సారించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఆదిలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్ గాడు అప్పారావు పాల్గొన్నారు.