S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పడకేసిన వైద్యం..!

రాయచోటి, ఆగస్టు 2: అందరిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది పలువురిలో అంకిత భావం లోపించి మొక్కుబడిగా విధులు హాజరు అవుతుండటంతో ఆసుపత్రులకే వివిధ రకాల జబ్బులు సోకి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. నియోజక వర్గ కేంద్రంలో ఏరియా ఆసుపత్రి, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో రెండేసి వైద్య ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు, కొన్ని మండలాల్లో ఒకే ఆరోగ్య కేంద్రం ఉన్న పలు ఆసుపత్రులలో వైద్యుల కొరత, సిబ్బంది కొరత వెంటాడుతున్నది. ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయకపోవడంతో పాటు వారికి కేటాయించిన నిర్ధేశిత ప్రాంతాల్లో కాపురం ఉండక పట్టణాలకు పరిమితం అయ్యారు. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కోసం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల అవుతున్నా, రాయచోటి పురపాలక సంఘానికి అదే తరహాలో నిధులు ఉన్నా అక్కడ పనిచేసే పారిశుద్ధ్యం అధికారులు పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా శాఖ, గ్రామపంచాయతీ, పురపాలక సంఘం, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖల అధికారుల్లో సమన్వయం లోపించి ప్రజల ఆరోగ్యం గురించి అంటుపట్టనట్లగా వ్యవహరిస్తున్నారనేది జగమోరిగిన సత్యం. వర్షాకాలం ప్రారంభం కావడంతోపాటు వాతావరణంలో భారీ మార్పులతో ఎక్కడి చెత్త చెదారం అక్కడే ఉన్నందున అంటువ్యాధులు ప్రబలి ప్రజలను పీడిస్తున్నాయి. ప్రాణాంతకరమైన వ్యాధులు చికెన్ గున్యా, మెదడు వాపు, డెంగ్యూ, విష జ్వరాలులతో పాటు పలు వైరల్ ఫీవర్లు సోకి గ్రామాలను గ్రామాలనే వణికిస్తూ ప్రజలు మంచం పట్టారు. రాయచోటి పురపాలకంలో 50 పడకల ఏరియా ఆసుపత్రి ఒక కమ్యూనిస్టూ ఆసుపత్రి ఉండగా గ్రామీణ ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం రోగులు వచ్చినా వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వైద్యుల్లో ఆధిపత్య పోరు ఉన్న కారణంగా తమ ప్రైవేటు ప్రాక్టిస్‌కు చూపే శ్రద్ధ ప్రభుత్వ విధులకు శ్రద్ధ కనపరచకుండా మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు ఎటువంటి చిన్న జబ్బుతో వచ్చినా వైద్యులు రెఫర్ అంటూ చేతులు దులుపుకుంటూ వారిని తిరుపతి, కడప, బెంగళూరు, వెలూరు, హైదరాబాదులకు తరలి వెళ్లాలని ఆదేశిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షల కింద ప్రభుత్వం కోట్లు విడుదల చేస్తున్న అవి నిరుపేదలకు ఉపయోగపడటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. గాలివీడు మండలంలో గాలివీడు, నూలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆరోగ్య కేంద్రాలు ఉన్నా అవి సక్రమంగా పనిచేసిన పాపాన పోవడం లేదు. వాటినిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ఇక్కడ మహిళ డాక్టర్ లేకపోవడంతో ప్రజలు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసిన ఇంత వరకు సమాధానం లేదు. సకాలంలో ఆసుపత్రులు తెరవకపోవడంతో గ్రామీణ ప్రజలు రోగాల బారిన పడి పట్టణ ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అలాగే వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులతో పాటు సిబ్బంది కూడా లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులే దిక్కు అని ప్రజలు వాపోతున్నారు. శాసన మండలి ఉపాధ్యక్షులు ఎస్‌వి సతీష్ కుమార్ రెడ్డి స్ధానికంగా ఉన్నా ఆసుపత్రిలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం గర్హానీయం. ఈ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చినా కనీసం కనె్నత్తికూడా ఇంత వరకు ఉన్నతాధికారులు చూడకపోవడం దారుణం. సంబేపల్లె మండలంలో సంబేపల్లె, దేవపట్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దేవపట్ల ఆరోగ్య కేంద్రం 24 గంటలు సేవలు అందిస్తూ ఉంటే సంబేపల్లె మండలం మాత్రం అధ్యాన్నంగా తయారైంది. ఉప కేంద్రాలు ఉన్నా వాటిని తెరిచిన దాఖలాలుకూడా లేవు. దేవపట్లలో నలుగురు వైద్యులు ఉండగా ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఎప్పుడో ఒక్క సారి వచ్చిపోతున్నారు. పలు గ్రామాల్లో ప్రతి సంవత్సరం మలేరియా, డంగ్యూ వంటి వ్యాధులు వచ్చి ప్రాణప్రాయ స్థితి వరకు సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లో దోమలు ఎక్కువ కావడంతో పాగింగ్ లాంటి ఉపయోగించడం లేదు. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో ముఖ్యంగా స్ర్తిలు పట్టణాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి దాపురించింది.రామాపురం మండలంలోని ప్రభుత్వ వైద్య కేంద్రం అంతంత మాత్రమే పనిచేస్తున్నప్పటికీ మండలంలోని నాలుగు ఉపకేంద్రాలు ఉన్నప్పటికీ ఏ ఉపకేంద్రం అసౌకర్యాలు దర్శనమివ్వడంతో కనీసం సిబ్బంది కూడా కనె్నత్తి చూడకపోవడంతో రోగులు లబోదిబోమంటున్నారు. గువ్వలచెరువు, హసనాపురం, చిట్లూరు, బండపల్లె గ్రామాలలో ఉపకేంద్రాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా పాడైపోవడం ఆ గ్రామానికి ఉన్న సూపర్‌వైజర్లు కనీసం అక్కడ లేకపోవడంతో వైద్యం కోసం మండల కేంద్రానికి రాక తప్పలేదు. టి.సుండుపల్లె మండలంలో రోజు రోజుకూ పెరుగుతన్న వాహనాల రద్దీ కారణంగా వాతావరణ కాలుష్యం అధికమవుతుండటంతో సుండుపల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుండుపల్లె క్రిష్ణానగర్, బాలాజీనగర్ ప్రజలు ఇబ్బందులు అంతా ఇంతా కాదు. రకాల జ్వరాలతో బాధపడుతున్న ప్రజలను వైద్యాదఙకారులు పట్టించుకొని మెరుగైన వైద్యం అందించాలి. చిన్నమండెం మండలం మరియు కొత్తపల్లె పంచాయతీలలో రెండు ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. వైద్యులు మాత్రం స్థానికంగా నివాసం ఉండక పట్టణాలలో ఉన్నారు. సిబ్బంది కూడా పట్టణాలలో కాపురాలు ఉండటంతో గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరబల్లె మండలంలో కూడా ఆరోగ్య కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు సక్రమంగా విధులు నిర్వహిస్తే సిబ్బంది కూడా సకాలంలో వస్తారని అయితే వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా అటు సిబ్బంది ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకుని రాయచోటి నియోజక వర్గ పరిధిలోని ఆయా మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సక్రమంగా రీతిలో పనిచేసి గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని అందిస్తారన్న ఆశలు సర్వత్రా వినిపిస్తున్నాయి.